పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/313

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యసనమన స్తత్వము కలదు. ఈ పరస్పర క్రియాకలాపమును శాస్త్రీయముగా పరిశోధనచేయుట అవసరము. అందువలన ఒక సంపూర్ణు డైన వ్యక్తి ఇతర వ్యక్తులతోను, ప్రపంచముతోను యథార్థముగా కలిసి మెలిసి సంచరించు విధానము నే పై కాలజీ శాస్త్రీయముగా పరిశీలించుటకు పూనుకొనును. మనము సై కాలజీని అనుసరించి చూచినచో వ్యక్తి యొక్క కృత్యములన్నిటిలోను మిక్కిలి ప్రధానమైనది అభ్యసనము. తెలివి, వ్యక్తిత్వము, మనోవికారము, ఇంద్రియజ్ఞానము లేక ఆలోచన మున్నగు వాటిలో ఏ విషయమును మనము గ్రహించినను అది అభ్యసనము పైననే ఆధారపడును. మనుష్యుడు గ్రహణశక్తి కలిగిన జంతువు. అతడు నిత్యము నేర్చుకొనుచుండును. అతడు నిస్సందేహముగా సాంఘిక ప్రభావములచే పూర్తిగా కాకున్నను కొంతవరకై నను మారుచుండును. పూర్తిగా మారుటకు అతడు కేవల యొక మంటిముద్ద కాదు. ఒక విధముగా అతనిని "ప్లాస్టిక్" తో పోల్చవచ్చును. అతడు వాతావరణముతో స్పందించి, తన స్వార్థమును స్వీయ యత్నముచేతనే సంపాదించుకొనును. అతడు తన వర్గసంస్కృతిని ఒక క్రమపద్ధతిలో తెలిసికొని, ప్రత్యేకపాత్రను అర్థము చేసికొనును. సాంఘిక శాస్త్ర ములు “వ్యక్తి నేర్చుకొనును” అన్నంతవరకే బాధ్యతను వహించుసు. కాని సైకాలజీ అనునది ఆ నేర్చుకొను క్రమపద్ధతిని పరిశీలించునట్టి విశేషబాధ్యతను కూడ నిర్వ హించును. అందువలన నేర్చుకొనుట అనుదానికి సరియైన అర్ధమేమియో, ఎప్పుడు ఏ పరిస్థితులలో ఏ విధముగా మనము నేర్చుకొందుమో, ఇత్యాది విషయములను నై కాలజీ వివరించును. తన అభ్యసనము యొక్క క్రమపద్ధతులను గురించి తెలిసి కొనుటకు ముందు, విద్య అను పదము యొక్క నిర్వచ నము అవసరము. ఆక్సుఫర్డు నిఘంటువు దీనిని అధ్యయ నము వలన లంభించిన విజ్ఞానము అని నిర్వచించినది. అందుచే అధ్యయనము చేతను, ప్రయత్నముచేతను నేర్చు కొనిన విషయమంతయు విద్యయను పదమున నిమిడి యున్నది. మరియు అప్రయత్నముగా నేర్చుకొనిన విషయ ములు, సంభవాత్మకములైన క్రియలవలన నేర్పడిన కౌశ ల్యము, వస్తువులతోను, మనుష్యులతోను గలిగిన పరిచ 254 యము వలనను సంబంధమువలనను లభించిన నిపుణత, అభి ప్రాయములు గూడ ఈపద మునందు ఇమిడియున్నవి. ఇచ్ఛా పూర్వకముగ నేర్చుకొనునవి విషయములను వల్లెవేయుట వంటివి కొన్ని గలవు. అభ్యసన మనునది అన్ని పనులకు వర్తించును. చదువుటవలన చదువనేర్తుము. పాడుటవలన పాడనేర్తుము. ఒక మనుష్యుని స్వభావమును ఆతని ముఖమును చూచుటవలన తెలిసికొందుము. ప్రొఫెసర్ వుడ్ వర్తు చెప్పినట్లు, ఏ ఉత్తమ కృత్యమునైనను విద్యగా పరిగణింపవచ్చును. కాని ఆ కృత్యము వ్యక్తిని మంచి వానిగాగాని, చెడ్డవానిగాగాని వృద్ధిచేసి అతనికి ఉత్తర కాలమున ఏర్పడు ప్రవర్తనమును, అనుభవమును అతని పూర్వకాలికములైన ప్రవర్తన అనుభవములకంటే భిన్న మైన వాటిగా చేయవలెను. అభ్యసనమన నేమి ? : కొన్ని పనులు మనుష్యునకు నేర్చుకొనకుండనే వచ్చును. ఉదా: పుట్టినతోడనే శిశువు శ్వాసమును పీల్చుట. నేర్చుకొను అవకాశము లేకుండ గనే శిశువు ఈ పనిని చేయుచున్నది. కాలక్రమమున శ్వాసము పీల్చుటయందు ప్రావీణ్యము లభించగా, శ్వాసము పీల్చుకొనుటయందలి ప్రత్యేక పద్ధతులను కూడ శిశువు నేర్చుకొనును. ఉదా: శ్వాసమును బిగబట్టుట ; శ్వాసమును లోనికి పీల్చుకొని చేయు వ్యాయామములు; క్రొవ్వొత్తిని ఊది ఆర్పివేయుట; మొదలగునవి. స్వత సిసిద్ధములైన శారీరక కార్యములు తప్ప, తక్కిన వన్నియు నేర్చుకొను పనులే అయియున్నవి. అభ్యసనము ఎప్పుడు జరుగును ? : విషయములు అభ్యసింపబడినవని మనము ఎప్పుడు చెప్పుదుము? లేదా ఏ పరిస్థితులలో నేర్చుకొను క్రమపద్ధతి యేర్పడును? అను ప్రశ్న ఇప్పుడు ఉదయించుచున్నది. అభ్యసనము యొక్క స్వభావమును పరిశీలించుటకు అనేక ప్రయోగ ములు చేయబడి, అమూల్యమైన ఫలితములు సేకరింప బడి యున్నవి. ముఖ్యముగా నీ ప్రయోగాత్మక పద్ధతి ఈ అభ్యసన రంగమునందు చాల సఫలమైనది. మానవుని జ్ఞాపకశక్తిపై మొట్టమొదటగా ప్రయోగములు పందొమ్మిదవ శతాబ్ది చివరి 25 సంవత్సరములలో చేయ బడినవి. కొన్ని సంవత్సరముల తర్వాత నిపుణములయిన సంచలనాత్మక కృత్యములపై ప్రయోగములు కావింప