పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/312

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అను పదమునకు మనస్సు అని అర్థముచెప్పిరి. వివేచనము వలన మనస్సు అను అర్థము కూడ అసమగ్రమని విదిత మయ్యెను. పిదప కొందరు నిపుణులు సై కాలజీని చైతన్య పరిశీలనమని నిర్వచించిరి. ఆ నిర్వచనముచే చైతన్యము కొంచెముగా నున్న పుడును, పూర్తిగా లేనపుడును ఏర్పడు సమస్యలకు పరిష్కారములు లభింపవయ్యెను. అందుచేత వారు పై కాలజీఅను పద నిర్వచనమును సమగ్రమొనర్చిరి. ఆ నిర్వచనమును బట్టి పై కాలజీ అను పదము మానవ ప్రవర్తన శాస్త్రమను నర్థమునందు రూఢమయ్యెను. ఒక సుప్రసిద్ధుడయిన మనస్తత్వజ్ఞుడు వచించినట్లు సై కాలజీ అను పదమునకు ఆత్మ, మనస్సు, చైతన్యము అను వర్థ ములు క్రమముగా మారి “మానవప్రవర్తనశాస్త్రము" అను నర్థము మాత్రమే రూఢియైనది. మానవప్రవర్తన శాస్త్రము విశాలమైనది. ఇందులో శారీరక శాస్త్రము (Physiology), సాంఘిక శాస్త్రము (Social Science) వంటి శాస్త్రము లనేకములు ఇమిడియున్నవి. శారీరక శాస్త్రము ప్రాణి యొక్క పనులను నిర్వహించు అవయవములను, జీవాణువులను పరిశీలించును. సాంఘిక శాస్త్రము రాజ్యములను, మానవ సంఘములను పరిశీ లించును. ఈ రెండు శాస్త్రములకు మధ్య మరి యొక శాస్త్రము కలదు. అదే మనస్తత్వశాస్త్రము. అది వ్యక్తి యొక్క పుట్టుక మొదలుకొని అతని కై శవము, బాల్యము, యౌవనము, వార్ధక్యము, అంత్యదశ మున్నగు వివిధ దశలను పరిశీలించు శాస్త్రము. ఒక వ్యక్తి యొక్క జీవిత ములో పెక్కు పరిణామములు కలిగినను, అతని వ్యక్తి త్వము మాత్రము మార్పుచెందదు. అందుకు కారణము అతనియందు వివిధ పరిణామములు జరుగుచుండగా అతని ప్రవర్తనములో అవిచ్ఛిన్నమైన ఐక్యమొకటి కని పించుటయే, బాలునకును, వయోజనునకును, సామాన్యత కును, అసామాన్యతకును, మానవునకును, జంతువునకును గల తారతమ్యమును పై కాలజీ చూపును. వ్యక్తుల మధ్య గల తారతమ్యములను విద్య, ఆలోచన, ఉద్రేకము మొద లగు వ్యక్తి యొక్క కార్యశక్తి నియమములను, సైకా లజీ విశేషముగా పరిశీలించును. పై కాలజీ, వ్యక్తి యొక్క ఉత్సాహకృత్యములను పరిశీలించు శాస్త్రమని చెప్ప వచ్చును. ఇచ్చట కృత్యము అన్న పదము విశాలమైన 253 అభ్యసనమన స్తత్వము అర్థముతో వాడబడినది. ఈ పదములో భౌతిక, ఆంగిక, మానసిక కృత్యములు ఇమిడియున్నవి. సాధారణముగా మనచే మానసికకృత్యములుగా ఎంచబడినటువంటి నేర్చు కొనుట, జ్ఞాపకముంచుకొనుట, ఆలోచించుట, పరిశీ లించుట, పన్ను గడచేయుట, నిశ్చయించుట, తెలిసికొనుట, అనుభవించుట, అసహ్యించుకొనుట మున్నగువాటితో పై కాలజీకి ఎక్కువ సంబందము కలదు. తెలిసికొనుట, అనుభవించుట, చేయుట అను నీ ప్రధాన శీర్షికల క్రింద తెలిసికొనుటకు, పరిశీలించుటకు వీలు కలుగుటకై, ఈ ఉత్సాహకృత్యములన్నిటిని వర్గీకరించి నను, వీటిలో ఒకదానినుండి మరొక దానిని విభజించుచు సులభముగా • సరిహద్దు గీతలు గీయుట అసాధ్యము. కారణము, ప్రతి మానసిక కృత్యము శారీరకకృత్యముగా గూడ పరిగణింప బడుచుండుటయే. పైగా, మెదడు తీవ్రముగా పనిచేయు టకు ఉపక్రమించిన ప్రతి కృత్యముకందును, సాధారణ ముగా, కండరములు, ఇంద్రియములు కూడ తమ పాత్రను నిర్వహించుచుండును. వివిధ అంగములు తమ తమ కృత్యములను నిర్వహించు రీతిని పరిశోధించుట శారీరశాస్త్రము యొక్క కర్తవ్యము. ఆశాస్త్రము సంపూర్ణ వ్యక్తి యొక్క జీవితమునకు ప్రతి అవయవము ఏమేమి సమకూర్చునో పరిశీలించుటకు ప్రయత్నించును. ఉదా : చూచునప్పుడు కంటిలోను, మాట్లాడునప్పుడు వాగింద్రియములోను కలుగుచున్న పరిణామములను ఈ శాస్త్రము పరిశోధించును. ఆయితే శారీరకశాస్త్రమే మానవప్రవర్తనమును గూర్చి అన్ని వివరములను తెలియ జేయగలిగినచో, ఇక పై కాలజీ అను శాస్త్రముతో మన కేమి అవసరము కలదు అను ప్రశ్న ఉదయింపవచ్చును. ఈ ప్రశ్నకు సమాధానమిది. శారీరక శాస్త్రము మనము తెలిసికొనవలసినవిషయములో కొంత భాగమునుమాత్రమే చెప్పును. ప్రేమించునది, ద్వేషించునది, జయించునది, ఓడిపోవునది యథార్థముగా నొక వ్యక్తియే. అతనికి కర్తవ్యములు కలవు; పరిష్కరింపవలసినవమస్యలు కలవు. అతడు సమర్థతతోను, సంతోషముతోను, ఇతర వ్యక్తుల తోమ, వస్తువులతోను మెలగవలసి యుండును. సంపూర్ణు డైన వ్యక్తికిని, అతని చుట్టునున్న ప్రపంచమునకు మధ్య అనంతమును పారస్పరికమును నగు కార్యసమూహము