పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/311

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యసనమన స్తత్వము హుతులను తీసికొనిన పిదప అన్నమును వ్యంజనముల సమ్మేళనముతో భోజనమును చేయుచున్నట్లు లోకము నందును వేదమునందును ప్రసిద్ధి కానవచ్చుచున్నది. పెరుగు చమనం మృతస్య పూర్ణగ్ స్వధాంతముపోదతిష్ఠన్ తమ జుహవుః | తేన ద్వయీ మూర్ఖ మవారుంధత తస్మా ద్విరహ్నో మనుష్యేభ్య ఉపప్రియతే ప్రాత ళ్ళ సాయం చ" (కృ. య. బ్రా. కాం. 4. ప్ర. 9. అ.) అని కలదు. పూర్వము ఒకప్పుడు ప్రజలు హోమము లేకుండ ఉపవాస రూపమగు తపస్సును చేయుచు, సత్రయాగ సదృశమగు సుకృతమును సంపాదించిరి. ఇట్లు తపస్సును చేయుచుండగా కొంతకాలమునకు వారికి ఉచితమగు ఆ అన్నమును ధరించునట్టియు, ఘృతపూర్ణమగు నట్టియు చారుమయమునగు నొక పాత్రవిశేషము కానవచ్చెను. వారు దానిని చేతబూని నిలువబడి ఆ ఆజ్యమును అగ్ని యందు హోమము చేయగా ఆ హోమ ప్రభావముచేత ఆ ఒక దినమున కాలద్వయమందు భోజ్యమగు అన్నము సంప్రాప్తమయ్యెను. అప్పటినుండి నేటివరకును లోక ములో సామాన్యులచేతను, శిష్టులచేతను దినమునకు భోజనము రెండుసార్లు (సాయం ప్రాత స్సమయము దధి (పెరుగు) : ఇవ్విధముగ భోజనమును చేయు సందర్భములో అంత్యమున పెరుగుతో భోజనమును సమాప్తి చేయవలెనని చెప్పి, ఆ పెరుగును తయారుచేయు విధానమును శ్రుతి ఈ క్రిందివిధముగా బోధించుచున్నది: "య త్పూతికై ర్వా పర్జవల్కై ర్వా పంచ్యాత్సౌమ్యం తర్వత్క్వీలై రాక్షసం తద్య త్తండులై ర్వైశ్వ దేవం తద్యదాతం చనేన మానుషం తద్య ద్దన్నాతత్యేంద్రం దధ్నాతనక్తి సేంద్రత్వాయ" (కృ. య. సం.2-5-8) సోమలతా సదృశములగు ఓషధివిశేషములచేగాని పూతీ కముచేగాని, మోదుగ చెట్టు యొక్క బెరడుచేతగాని, క్షీరములలో తోడు పెట్టుట చేత నిష్పన్న మయిన పెరుగు సోమదేవతకు ప్రియమైనది అని పై శ్రుతిభావము. అటులనే శ్రీరములకును స్థూల బదరీఫల సంబంధముచే నిష్పన్న మయిన పెరుగు రాక్షసులకు ప్రియమయినది. తండుల సంపర్కముచే నిష్పన్నమగు దధివిశ్వేదేవతలకు ప్రియములందు) చేయబడుచున్నది. ఇవ్విధముగ రెండు పూటల కొంచెము పులిసిన మజ్జిగచే నిష్పన్నమయిన పులిసినమజ్జిగచే మనుష్యులకు ఇష్టమయినది. వీరములలో పెరుగు తోడు పెట్టగా నిష్పన్నమయిన దధి ఇంద్రునకు ప్రియమయినది. అట్టి పెరుగును ఇంద్రునకు హోమము చేయుటకై పాత్రయందు గ్రహించునపుడు పాలను ముందు గ్రహించి అంత్యమున పెరుగును గ్రహణము చేయవలెను. అట్లు చేయుటచే ‘ధినోతీతి దధి' అని వ్యుత్పత్తి కావున, 'ధివ్ ప్రాణనే' అను ధాతువువలన ఏర్పడిన 'దధి' శబ్దమునకు 'సంతోషపరచునది' అని అర్థము కావున అట్టి వస్తువును చివర గ్రహణముచేసి హోమమొనర్చుటచే ఇంద్రునకు సంతోషము (తృప్తి) జనించును, అని తెలియుచున్నది. “దధ్నో పరిష్ఠార్ధినోతి” అను నీ శ్రుత్యర్ధము ననుసరించియే లోకములో పెరుగుతో అంత్యమున భోజనము చేయు నాచారము ఏర్పడెను. ఇట్లు సర్వపదార్థములను భుజించిన పిదప అంత్యమున పెరుగుతో భోజనమును సమాప్తి చేయుటచే, మానవునకు సంతృప్తి జనించుచున్నది. రెండుసార్లు భోజనము "ప్రజాపై సత్రమాసత తప _స్తవ్యమానా అజుహ్వతీః ..మనుష్యా అపశ్యజా 252 భుజించునపుడు కొంచెము తక్కు వగ భుజింపవలెననియు, ఏకాదశి మున్నగు దినములందు దినమున కొకసారే కడుపునిండ భుజింపవ లెననియు స్మృతి భోధించుచున్నది. పై విధముగ, శ్రుతి, స్మృతి, శిష్టాచారములననుసరించి ఆహారమును భుజించు మానవులకు ఆయురారోగ్యములు సంపూర్ణముగ సిద్ధించునని అనుభవపూర్వకముగ స్పష్ట మగుచున్నది. ఉ. గ. శా. అభ్యసనమన స్తత్వము :- అభ్యసన మనువిషయ మును గురించి ప్రసంగించుటకుముందు మన స్తత్వమునకు సమానార్థకమగు నై కాలజీ (Psychology) అను పదము యొక్క అర్థమును స్పష్టముచేయుట అవసరము. శబ్ద వ్యుత్పత్తి ననుసరించి పై కాలజీ అను పదము 'ఆత్మ' అను అర్థమునిచ్చు 'సైక్' అను పదమునుండి ఉద్భవించినది. అందువలన ఈ శాస్త్రమును మొదట ఆత్మసంబంధమైన శాస్త్రముగా పరిగణించిరి. కాని ప్రాచీన తత్వజ్ఞులు ఆత్మ పదార్థ వివేచనకై ప్రయత్నించియు విఫలులై 8. అందు వలన మొదటి నిర్వచనమును సవరించి వారు పై కాలజీ