పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/310

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమముగా శ్రవణము చేయబడినచో అది దేవతాప్రియ మగు హవిస్సగును. అందుచేత విడావాదులు లేకుండ సమముగా శ్రపణము చేయవలెనని దీని భావము. వెన్న, నెయ్యి : "మృతం దేవానా మస్తు పితౄణాం నిష్పక్వమ్, మనుష్యాణాం తద్వా ఏత త్సర్వదేవత్యం యన్నవనీతం" (కృ, య.సం. 6-1-1) అను శ్రుతివాక్య మొకటికలదు. యజ్ఞములో ప్రధ మదినమునయజమానుడు యజ్ఞశాలలో ప్రవేశించిన పిదప తన శరీరమందంతటను వెన్నను నఖశిఖాపర్యంతము రాచుకొనవలెననియు, అట్టి వెన్నను సంపాదించు నిమిత్తము మజ్జిగ చేయునపుడు చల్ల గుంజకు త్రాటిని కట్టి పెరుగును చిలికి తీసిన వెన్న దేవతలకు ప్రియమైనదనియు, చల్లగుంజ లేకుండ రెండు చేతులతో (చిన్న కవ్వముతో) మాత్రమే పెరుగును మధించి తీసిన వెన్న పితృదేవతలకు ప్రియమైనదనియు శ్రుతిబోధఅయియున్నది. కావున శిష్టాచారానుసారముగ స్మృత్యాదిబోధితమగు కవ్వముచే మధితమైన వెన్న దేవతా యోగ్యమును సర్వదేవతా ప్రీతిపాత్రమును నై యున్నదని తేటపడుచున్నది. ఈ వెన్న ను కాచి నెయ్యిగా తయారు చే యునపుడు పాక జన్యమయిన అవస్థాభేదములచే సర్వదేవతలకు ప్రియమైనట్లు శ్రుతి వక్కాణించుచున్నది. ఎట్లన మామూలుగా కాగిన నెయ్యి దేవతలకు ప్రియ మైనది. అరక నెయ్యి పితృదేవతలకు ప్రియము. కాగి పరిమళ ముతోగూడిన నెయ్యి మనుష్యులకు ప్రియము గాన ఈ తీరున వెన్న సర్వదేవతా ప్రీతికరమని చెప్ప బడినది. అట్టి వెన్నకు మూలమగు పాలను గూర్చి కృష్ణ యజు ర్వేదములో “అభివా న్యాయైదుగ్గేభవతి | సాహిపితృ దేవత్యందు హే॥" (కృ. య. బ్రా.) అను శ్రుతివాక్యము కలదు. దూడ చనిపోయిన గోక్షీరములు పితృదేవతలకు ప్రియమైనవి అని దీని భావము. మరియు | దూడగల గోక్షీరములు దేవతలకు ప్రియములయినట్లు దర్శపూర్ణ మాసాది శ్రాతకర్మలందలి గోదోహనాది పర్యాలోచన చే స్పష్టనుగుచున్నది. కావున తత్తదేవతాక ములుగుకర్మలందు తత్త దేవళానుగుణమగుశ్రీ, రజన్యమగు నవనీతముచే, తత్త దేవతానుగుణముగ ఆజ్యమును తయారుచేసి తదనుగుణ ముగ హోమాదులయందు ఆజ్యమును వినియోగింపవలసి నట్లు విశదమగుచున్నది. 251 అభ్యవహారము - ఆర్షపద్ధతి పాత్ర నిర్ణయము : భోజనము రజతపాత్రలో పితృ దేవతలకును, సువర్ణపాత్రలో దేవతలకును ప్రియమైనట్లు ఆబ్దికమంత్రములో విశ్వేదేవతలకును, పితృదేవతలకును, అర్చనచేయు సందర్భమునందలి “సౌవర్ణ మిదం పాత్రం" "రాజత మిదం పాత్రం" అను వాటిచే స్పష్టమగుచున్నది. వెండి కంచములను ఉపయోగించువారు దేవతానివేదన చేయుటకు యోగ్యతా సంపత్తి కలుగుటకు, బంగారపు పువ్వును వేయించినచో అది సువర్ణపాత్ర అగును గాన అది దేవతానివేదనకు అనుకూలమగును. శక్తి లేనివారు అరటి ఆకును ఉపయోగించి తత్తత్కర్మానుగుణముగ రాజత, సౌవర్ణపాత్ర భావనచే ఆబ్దికాదులయందు కర్మను నిర్వర్తించేడి ఆచారముకలదు, కాని 'కదళీ గర్భపత్రంచ' అను స్మృతిచే అది నిషేధింపబడినది. అందుచే అరటి డిప్పచే కుట్టబడిన బొంద విస్తళ్ళను ఉపయోగించరాదు.

ఇట్లు యథాసంభవముగను, యథాశక్తిగను పాత్రను సంపాదించి పూర్వోక్త ఆజ్యముచే పాత్రాభిఘోరమును చేసి పదార్థములను వడ్డించిన పిదప తిరిగి అన్నాభిఘార మునుచేసి, అనంతరము పూర్వపరి షేచనముచేసి ప్రాణా హుతులను పండ్లకు తగులకుండ మ్రింగవలెను. దీనిని ప్రాణాగ్నిహోత్ర మందుకు. ఇట్లు ప్రాణాహుతులను తీసికొనకుండ భోజనమును చేసినచో నరుడు భగ్నవ్రతు డగునని స్మృతులు బోధించుచున్నవి. భోజనము చేయు రీతినిగూర్చి "ప్రాచీ మఖ్యాకారం అగ్రై రంతతః । ఏవ మివ హ్యన్న మద్యతే" (కృ. య. బ్రా. 8-8-1) “హస్తం పురతః పాత్రే ప్రసార్య అభితః భోజ్యా న్యాకృష్య ముఖబిలే ప్రతిపతి తద్వత్"అని శ్రుతిస్మృతులు కలవు, దర్శపూర్ణమాసలు అను శ్రాతకర్మలో స్రువము, జుహువు మున్నగు నామములచే ప్రసిద్ధములగు దారు మయములగు హోమపాత్రలను దర్భాగ్రములచే తుడుచు సందర్భమున, లోకమునందు మానవుడు భోజన సమయ ములో ఎదుటనున్న భోజనపాత్రయందు హ స్తమును ప్రసరింపజేసి, ఇరుప్రక్కలగల వ్యంజనములను ఆకర్షించి అన్నములో కలుపుకొని నోటిలో ఎట్లు వేసికొనునో అటు అనే ఈ హోమపాత్రలను తూర్పు నుంచి దర్భాగములచే . మధ్యభాగమునకు సంమార్జనము చేయవలయునవి పై శ్రుతి సూత్రములు బోధించుచున్నవి. గాన ప్రాణా