పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/309

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యవహారము - ఆర్షపద్ధతి అగ్ని పుట్టిన పిదప, “ఉఖ్యేజాత ఆహవనీయమనుగ మయ్య" (ఆ. జౌ. సూ.) అను సూత్రానుసారము ఉఖాగ్ని పుట్టుట తోడనే, అడుగుననున్న ఆహవనీయాగ్నిని, పూర్తిగా ఆర్పివేసి, ఈ ఉఖాగ్నినే, ఆహవనీయాగ్ని స్థానీయముగా వ్యవహరింతురు. అనగా ఆహవనీయాగ్నియందు చేయ వలసిన హోమాదులను ఉఖాగ్నియందే చేయుదురు. ఇట్టిది ఆచారముగా చెప్పబడినది. అనంతరమందు కామనా విశేషముచే కృష్ణ యజుర్వేద సంహితలో “అంబరీషా దన్న కామస్యావధ్యా దంబరిషేవా అన్నం త్రియతే సయోన్యేవాన్న మవరుం ధే॥ (1-1-10) “లోకములో మృణ్మయ పాత్రయందు అన్నము వండుదురు గాన అన్న మును కోరు యజమానునకు అంబరీషము (మృత్పాత) నుండి అగ్నిని తీసికొని వచ్చి ఉఖయందు అగ్నిని ఉత్పాద నము చేసినచో అట్టి యజమానునకు సమృద్ధమైన అన్నము లభించును" అని చెప్పబడినది. ఈ శ్రుతివలన ఆర్ష సంప్ర చాయములో మృణ్మయపాత్రచేతనే అన్నమును వండు చున్నట్లు స్పష్టమగు చున్నది. మృణ్మయపాత్రను తడుపుట : లోకములో క్రొత్త మృత్పాత్రలను ప్రథమములో పాలతో తడిపి వాడు చుండెడి సంప్రదాయము కలదు. దీనిని సహేతుకముగ శ్రుతి విధించుచున్నది. కృష్ణ యజుర్వేద సంహితలో "అసుర్యం పాత్ర మనాచ్ఛృణ్ణ మాచ్ఛృణత్తి దేవత్రా కరజ శ్రీ రేణాచ్ఛృణక్తి పరమం వా ఏత త్పయోయ దబుక్షీరం వరమేణై పానాం వయసాచ్ఛృణత్తి యజుషా వ్యావృత్యే. (కృ. య. సం. 5-1-7) యజ్ఞసాధనమగు మృణ్మయపాత్రను కాల్చిన పిదప ప్రథమములో ద్రవద్రవ్యముచే తడవకుండా వాడినచో ఆ పాత్ర అసురయోగ్యమగును. ద్రవద్రవ్యముచే తడిపి వాడినచో ఆ పాత్ర దేవకర్మలకు యోగ్యమగును. అనంత రము దేనితో తడవవలెను అను శంకపై లోకములో మేకపాలు సర్వవ్యాధులను తొలగించునటుల ప్రసిద్ధి కలదు. కావున అవి ఉత్తమ మయినవని తెలియనగును. వేదములో గూడ "ఆగ్నేయీ వా ఏదో యదజా" (కృ. య. సం. 5-4-8) (ప్రజాపతి ముఖమునుండి అగ్నితో కూడ మేక పుట్టినది గాన మేక అగ్ని సంబంధ మైనది. అందుచే అది ఉత్తమమయినది) అని చెప్పబడినది. ఇవ్విధ 2.50 ముగ లోకమునను వేదములలోను మేక ఉత్తమమైనది గాన దాని పాలచే క్రొత్తకుండలను తడుపవలెను అని చెప్పి “లోకములోవలె మంత్రరహితముగ తడుపరాదు. లోక వైలక్షణ్యముకొరకు యజ్ఞములో మంత్రములచే తడుపవలెను." అని వచించుటచే, లోకములో మంత్ర రహితముగ పాలతో తడుపుచున్నట్లు స్పష్టమగుచున్నది. లోకములో మేకపాలు తరచుగ సంభవించక పోవు టచే పాలతో మాత్రము తడుపుచుండెడి ఆచారము నేటి వరకు ప్రచారములో నున్నది. ఈ విధముగ శ్రుతిప్రమాణ ప్రచారములోనున్నది. ఈ ములచే క్రొత్తకుండను ప్రప్రథమము పాలతో తడిపి, అనంతరము ఆకుండతో వంటచేయవలెనని స్పష్టమగు చున్నది. దంపుడు అన్నము వండుట : వంట చేయునపుడు బియ్యమును కడుగకుండ అత్తెసరుగా వండవలసినదిగ “న ప్రణాళయతి, న ప్రస్రావయతి, న గాలయతి, జీవ తండుల మివ శ్రవయతీతి విజ్ఞాయతే" అని ఆ. శ్రా. సూత్రము చెప్పుచున్నది. ఈ సూత్రముచే వంట చేయు బియ్యమును కడుగకూడదు. దానిలో పోసిన నీటిని, కడుగును తీసివేయరాదు. నీటిని పోసిన తరువాత గాలించ రాదు. అనగా నొక్కికడిగి నేమరాదు. అత్తెసరుగా వండవలయును. అన్నము చిముడకూడదు. వంట బిరుసు పదునుగా నుండవలయును అని అగ్న్యాధానమునం దలి శ్రోతకర్మలో చెప్పబడినది. దర్శపూర్ణమాసలు అను శ్రోతకర్మలో "ప్రళ్య తండులాన్" (తండులములను కడిగి) అని చెప్పబడినది గాని గాలించి కడుగవలయునని చెప్పబడలేదు. అందుచేత బియ్యమును కడుగుకుండ అ త్తెస రుగా వండుట, బియ్యమును కడిగి అత్తెసరుగా వండుట అను రెండువిధములు కలవనియు, అట్టి అన్నము దేవతా యోగ్యమగుననియు స్పష్టమగుచున్నది. రొట్టెను కాల్చుట : కృష్ణయజుర్వేదమునందు "యో విదగ్ధ స్స నైర్ ఋతో యో ఒళృత స్స రౌద్రోయ ళ్శృత స్స దేవ స్తస్మా దవిదహతాళృతం కృత్య స్స దేవత్వాయ॥ (కృ. య. నం.2కాం.ప్ర.అ.) అని కలదు. పురో డాశము (రొట్టె) మాడునట్లు విశేషముగ కాల్చ బడినచో అది రాక్షసులకు ప్రియమగును. కొంచెము పచ్చిగా నుండినచో ఆ పురోడాశము రుద్రునకు ప్రియమగును.