పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/308

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వై ద్యులు పలుకుచుందురు. కాని ఈ శ్రుతిబోధితమగు కారణమును మాత్రము గ్రహింపజాలక, బియ్యము మిల్లులో పోసినచో వేడిమిచే విటమినులు పోవుచున్నవి. అందుచే అనారోగ్యము కలుగుచున్నది అని కొందరును, తవుడు పోవుటచే అనారోగ్యము ఏర్పడుచున్నది అని మరి కొందరును వచించుచున్నారు. ఈవిషయము ఎంతవరకు వాస్తవమో విమర్శింపవలసియుండును. ఎండులకన, దంపు నప్పుడుకూడ శ్రోతకర్మలలో నున్న "సంప్రేష్యతి " త్రిష్ఫలీక ర్త వై (అ.క్రౌ.సూ.) అను ఈ వేషమంత్రముచే మెరుగుపోటు వేయుమని అధ్వర్యుడు ఆజ్ఞాపింపగా "దేవేభ్య శ్శుధ్యధ్వం, దేవేభ్య శ్శుంధధ్వం, దేవేభ్య శుృంభధ్వం, సుఫలీకృతాజు కరోతి" అను సూత్రమంత్ర ములచే పత్ని మెరుగుపోటు వేసి పిదప చెరుగును. తవుడు అంత్యమున ఆ ఇష్టిలో దక్షిణాగ్ని యందు ఫలీ కరణ హోమము చేయబడును. లోకములో కూడ మెరుగు పోటుచే తవుడును తీసియే బియ్యమును సిద్ధము చేయు నాచారము పూర్వము నుండియు గలదు. ఆ వై ద్యులు తలచినట్లు మిల్లు బియ్యమునకు వేడిమిచే విటమినులు పోవుటగాని, తవుడు పోవుట గాని అనారోగ్య కారణమైనచో ధాన్యమును గోళ్ళతో ఒలిచి, బియ్యమును తయారుచేసినచో పై అనారోగ్యకారణములు ఆ బియ్యము నందు ఉండవు గాన అట్టి బియ్యమును స్వీకరించషలసి యుండును. అట్లు స్వీకరించినచో అవహననవిధికి పూర్వ మీమాంపా శాస్త్రములో విచారణచేసి నిర్ణయింపబడినట్టి (దంపు చేతనే బియ్యముడు తయారుచేయవలెను గాని ఇతర సాధనములచే చేయరాదు అను) నియమము వ్యర్థ మగును. వేద బోధితమయిన విశేషము రుజువు కావలెనన్నచో, కొంతకాలము గోళ్ళతో నిలిచిన బియ్యమును, మరి కొంతకాలము దంపుడు బియ్యమును ఉపయోగించినచో, గోళ్ళతో నొలిచిన బియ్యమునకు మిల్లు బియ్యమున కువ లె వేడిమి ప్రసక్తి యుండదు. తవుడు ఏమాత్రము పొ పోదుగాన దంపుడు బియ్యమునందు కంటే గోళ్ళతో ఒలిచిన బియ్య మునందు అధిక గుణము కనుపింపవలెను. అట్లు కనుపిం చక, దంపుడుబియ్యమును ఉపయోగించినప్పుడే విశే పారోగ్యము కనుపించినచో వేదప్రతిపాదితమయిన ఛంద 32 249 అభ్యవహారము - ఆర్షపద్ధతి స్సారము చండ్రరోకలిద్వారమున దంపుడు బియ్యము నందు సంక్రమించుటచేత నే ఆ గుణవిశేషము కన్పట్టు చున్నట్టు స్పష్టమగును. ఛందస్సారము బియ్యమునందు సంక్రమింపవలెనను తాత్పర్యముతోనే శిష్టాచారములో ధాన్యము నలుగుటకు సౌకర్యార్థము చండ్రరోకళ్లకు చుట్టు ఇనుపపొన్నులను వేయించుచున్నను, ఆ చండ్రకఱ్ఱ యొక్క మధ్యభాగ సంబంధము ధాన్యమునకు ఉన్నట్లును మనము గ్రహించుచునే ఉన్నాము. ఈ విధముగ దేవతాహవిస్సులలో అంతటను దంపుడు బియ్యమునే ఉపయోగింపవలెనని, నిరూపించిన పిదప, నిర్ ఋతి దేవతాకమయిన కర్మలో గోళ్ళతో ఒలిచిన బియ్యమునే ఉపయోగించవలసినదిగా శ్రుతి బోధించు చున్నది. కృష్ణయజు ర్వేద సంహితలో "నైర్ ఋతం చరుం పరివృక్ష్యై గృహే కృష్ణానాం వ్రీహీణాం నఖనిర్భిన్నం" అని కలదు. (1-6-9) రాజసూయమను మహాక్రతువులో 'రత్ని నాంహవి స్సులు' అను ఇష్టప్రక్రమములో, మహారాజునకు మహిషి, వావాత, పరివృక్తి అను ముగ్గురు భార్యలుందురనియు, వారిలో పట్టాభిషిక్తురాలగు భార్యకు 'మహిషి' అనియు సామాన్య ప్రీతిగల భార్యకు 'వావాత' అనియు, ప్రీతి రహితురాలగు భార్యకు ‘పరివృక్తి' అనియు నామములను నిర్దేశించి, వారి ముగ్గురిలో ‘పరివృక్తి ' అను భార్య యొక్క గృహమున కేగి 'మహారాజు అచ్చట నైర్ ఋతేష్టిని చేయు నప్పుడు నిర్ ఋతి దేవతకు నల్లధాన్యమును గోళ్ళతో ఒలిచి బియ్యము చేసి బియ్యముతోనే చరువును (అన్నమును) వండి ఆ దేవతకు ఆహవిస్సును ఇయ్యవలసి నదిగా శ్రుతి చెప్పుటచే, గోళ్ళ బియ్యమును, మిల్లు బియ్య మును దేవతలకు నివేదనము చేయుట, భుజించుట తగదని శ్రుతిశిష్టాచారములవలన స్పష్ట మ గు చున్నది. పంటకు పాత్ర విశేషము : మృణ్మయపాత్రతోనే వండ వలెను. ఎట్లన మహాగ్నిచయనమను క్రతువులో 'ఉఖ' అను కుండలో రంపపు పొట్టు మున్నగువాటిని ఉంచి ఆహవనీయ మను అగ్నిపై ఆ 'ఉఖ' ను ఉంచి ఆడుగున ఆహవనీయాగ్నిని లెస్సగా జ్వలింప చేసినచో, అడుగు మంటచే, ఉఖలో రంపపు పొట్టు మొదలగునవి అంటుకొని,