పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/307

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభ్యవహారము – ఆర్షపద్ధతి ధాన్యము) తో చేయబడిన రొట్టె; బృహస్పతికి నివరి ధాన్యపు అన్నము; ఇంద్రునకు మహావ్రీహుల (పెద్దవారి ధాన్యముతో చేయబడిన) రొట్టె ; వరుణునకు యవధాన్యపు అన్నము ; పూషదేవతకు దంతములు లేకపోవుటచే పిండితో చేసిన జావ మున్నగునవి; ఆగ్ని, సోముడు మున్నగు దేవతా భేదముచే, నల్లధాన్యము మున్నగు ద్రవ్యభేదముచే రొట్టె, అన్నము, జావ మున్నగు రూప భేదముచే శ్రుతిలో విధింపబడియున్నవి. దీనికి కృష్ణయజు ర్వేద సంహితలో ……… శ్రు. "అగ్నయే గృహపతయే పురోడాశం - కృష్ణా నాం వ్రీహీణాగ్ ం; సోమాయ - శ్యామాకం రుగ్ o ; సవిత్రే - పురోడాశం - ఆశూనాం వ్రీహీణాం బృహస్పతయే.నై వారం చరుం; ఇంద్రాయ.పురోడాశం- మహావ్రీహీణాం ; వరుణాయ - యవమయం చరుం " (కృ. య, సం. 1-8-10) “పూషా ప్రసిష్టభాగో ఒదంతకోహి" (కృ. య. సం. 2-8-8) అని కలదు. భావము :' లోకములో దైనందిన ప్రక్రియలో గోధుమరొట్టెలు, బన్ను రొట్టెలు, జొన్న అన్నము, సన్న బియ్యము అన్నము మున్నగు వాటిని గంటెజావ, గోధుమ జావ మున్నగువాటిని వేరు వేరుగా ప్రతి నియతముగా భుజించు మానవుల వలె, దేవతలలో గూడ ధాన్యాది భేదముచే ప్రతినియతాహారమును పై శ్రుతివాక్యములు బోధించుచున్నవి. ప్రకృతములో - పై దేవతలకు తత్తత్కర్మలందు ఆయా ధాన్యములచే (చరుపురోడాశాదులను) అన్న ము -మొదలగువాటిని చేయదలచినపుడు వీటి అన్నిటికిని -మొదట బియ్యము అవసరముగాన అట్టి బియ్యమును తయారుచేయుటకు లౌకిక సాధనము లగు నఖవిదళన మొనర్చుట ( అనగా గోళ్ళతో ధాన్యమును ఒలిచి బియ్యముగా తయారుచేయుట), మిల్లులో పోయుట, దంపుట మున్నగువాటిలో దేనిచేనైనను బియ్యమును తయారుచేయుటలో విశేషము కానరాదు గాన ఏ ఉపా 248 యముచే నైనను బియ్యమును తయారుచేయవచ్చునని లౌకిక దృష్టిచే సిద్ధమగుచు నుండగా; దంపుడు బియ్యము : శ్రుతిలో "వ్రిహీనవహంతి" (ధాన్యమును దంపియే (ధాన్యమును దంపియే బియ్యమును తయారుచేయవలెను) అను విధివాక్యము పూర్వమీమాంసాశాస్త్రములో బహు విపులముగ విచారించి సిద్ధాంతీకరింపబడినది. ఆ నియమ విధి ననుసరించి 'అవహననముచేతనే దంపుడుచేతనే) బియ్యమును తయారుచేయవలెను గాని నఖవిదళనాది... ఉపాయాంతరములచే తండులములను నిష్పాదనము చేయ రాదు' అని సిద్ధమయినది. దంపుడు బియ్యపు మహత్త్వము: నఖవిదళన మొనర్చుట మిల్లులో తయారుచేయుట, దంపుట మున్నగు సాధన ములలో దేనిచే సిద్ధము చేసినను బియ్యములో విశేషము కానవచ్చుట లేదుగదా! అట్టిసందర్భములో (అవహననము) దంపుచే తయారుచేసిన బియ్యములో మహత్త్వముండునా అని శంకింపరాదు. దానియందుగల అలౌకికమహ త్త్వము నటులనుంచి లౌకిక మహత్త్వమును గమనింపదగును. “వషట్కారోవై గాయత్రియై శిరో ఒచ్ఛినత స్యైరసః పరావతత్సవృథివీం ప్రావిశత్సఖదిరో భవద్యస్య భాది రన్రు వో భవతి ఛందసామేవర సేనావద్యతిసరసా అస్యాహుత యోభవంతి" ఇతి (కృ.య. సం.8.5-7). పూర్వమువషట్కార దేవతగాయత్రీ ఛందస్సు యొక్క శిరస్సును ఛేదింపగా దానిసారము పృథివియందు ప్రవే శించి ఖదిర (చండ్ర) వృక్షరూపముగ ఉద్భవించెను. కావున చండ్రకఱ్ఱతో నిర్మించిన స్రువముతో శ్రోతక ర్మ లందు ఆజ్యము మున్నగు ద్రవద్రవ్యములను గ్రహించిన ఛందస్సుల యొక్క సారముతో గ్రహించిన ట్లగును అని కృష్ణయజుర్వేదములో చెప్పబడినది. ఈ శ్రుతివలన 'చండ్రకఱ్ఱగాయత్రీ ఛందస్సు యొక్క సారము అని స్పష్టమగుటచే, లోకములో దంపుటకు, రోకళ్ళను చండ్రకఱ్ఱతోనే తయారుచేయుచుండెడి సంప్ర దాయము ఏర్పడినది గాన అట్టి రోకళ్ళచే ధాన్యమును దంపినచో ఛందస్సుల యొక్క సారము ఆ బియ్యమునందు ప్రవేశించును. కావుననే దంపుడు బియ్యము ఆరోగ్యము నకు సాధనమగుచున్నవి — ఈ గాథను తెలిసికొనక - పోయినను దంపుడు బియ్యము ఆరోగ్యమునకు కారణమని -