పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/306

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దృశమగు ఆగమపరిజ్ఞానమునకును, అద్వితీయ పాండిత్య మునకును నిదర్శనము. నిర్యాణము : ఇత డుద్దేశించిన కార్యమును ముగించిన తరువాత, తన 12 వందల శిష్యులతో గూడ భైరవుని గుహలో ప్రవేశించి మరల తిరిగిరాలేదట. ఆ గుహ మాత్రము ఇప్పటికిని శ్రీనగరుకును, గుల్మార్గు కును మధ్యనుండు “మగమ్” అను ప్రదేశమునకు 5 మైళ్ళ దూర ములో నున్నది. అచ్చట నుండు ముసల్మానులు గూడ ఈ ఐతిహ్యమును ఇప్పటికిని స్మరించుచున్నారు. అట్లు యోగ సిద్ధి నొందిన మహామాహేశ్వరు డీతడు. ఇత డనుగ్రహించిన గ్రంథములు : (1) బోధ పంచ దశిక (2) మాలినీ విజయవార్తికము (8) పరాత్రింశికా వివృతి (4) తంత్రాలోకము (5) తంత్రసారము (6) తంత్రవట ధానిక (7) ధ్వన్యాలోక లోచనము (8) అభినవ భారతి (నాట్యశాస్త్రవ్యాఖ్యానము) (9) భగవద్గీతార్థ సంగ్రహము (10) వరమార్థ సారము (11) ఈశ్వర వరమార్థసారము ప్రత్యభిజ్ఞావిమర్శిని (12) ఈశ్వర ప్రత్యభిజ్ఞావివృతి విమర్శిని (18) క్రమస్తోత్రము (14) దేవస్థ దేవతాచక్ర స్తోత్రము (15) భైరవస్తోత్రము (16) పరమార్థద్వాదశిక (17) పరమార్థచర్చ (18) మహోప దేశవింశతిక (19) అను త్త అనుత్త రాష్ఠిక (20) అనుభవని వేదనము (21) తంత్రోచ్ఛయము (22) ఘటకర్పరకుళక వివృతి (28) కర్మ కేళి (24) శివ దృష్ట్యాలోచనము (25) పూర్వపంచిక (26) పదార్థ ప్రవేశనిర్ణయటీక (27) ప్రకీర్ణక వివరణము (28) ప్రకరణ వివరణము(29) కావ్య కౌతుక వివరణము (80) క థాముఖ తిలకము (81) లఘ్వీప్రక్రియ (82) భేద వాదవిదారణము (88) దేవీస్తోత్ర వివరణము (84) తత్త్వార్థప్రకాశిక (35) శివశ క్త్యవినాభావస్తోత్రము (88) బింబ ప్రతిబింబ వాదము (87) పరమార్థసంగ్రహము (88) అనుత్తరశతకము (89) ప్రకరణస్తోత్రము (40) నాట్యాలో చనము (41) అనుత్త ర తత్త్వవిమర్శినీ వృత్తి. ఇంకను అనేక గ్రంథములు విర చించినటుల ఇతని గ్రంథములయందలి ప్రస్తావనలవలనను ఇతరుల గ్రంథములయందలి ప్రస్తావనల వలనను తెలియు చున్నది. ఇందు మొదటి 11 గ్రంథములు ముద్రితములు; 12.22 వరకును లిఖితగ్రస్థములు, 28.88 వరకును కొన్ని 247 అధ్యవహారము - ఆర్షపద్ధతి ముద్రితములు, కొన్ని అముద్రితములు. మిగిలినవి గ్రంథ ముల పట్టికలవలన తెలియనగుచున్నవి. అభినవగుప్తుని అభినవభారతి నాట్య రసమార్గములకును, తంత్రాలోకము కాశ్మీర శైవాగమ మార్గమునకును, ఆదర్శప్రాయములును నిరువమములును నగు మహా త్కృష్టగ్రంథములు. ఇవి, ఆయా మార్గములయందలి ప్రయాణమూర్ధన్యము లగు “ఆకర” గ్రంథములై యల రారును. శ్రీమదభినవగుప్తుల అమోఘ శేముషీ ప్రభావ మును, యోగసిద్ధిని, ఇవి బాహాటముగ తెలియ జేయు చున్నవి. ఇతని పాండిత్యము సర్వతో ముఖమైనది. అందుచే ఇత నికి పద వాక్య ప్రమాణ పారావారపారీణ- ప్రబంధ సేవా వాక్యప్రమాణపారావారపారీణ... రసం ధ్వనినాటక ప్రత్యభిజ్ఞాదర్శన ప్రవర్తకాచార్య- మహామా హేశ్వర... ఇత్యాద్యనేక బిరుదములు లభించెను. అభినవగుప్తుని లోచనము ధ్వన్యాలోక వ్యాఖ్యలలో నెల్ల మిన్నయైనది. పాణినీయమునకు మహాభాష్య మెట్లో అలంకారశాస్త్రమునకు లోచన వ్యాఖ్యఅట్లు. ఈ వ్యాఖ్య వలననే ధ్వన్యాలోకమునకు అనంత ప్రచార ప్రసిద్ధులు కలిగెను. లోచనమును రచించుటయందు అభినవగుప్తునకు ఉపకరించిన వ్యాఖ్య అతని పూర్వుడే రచించిన చంద్రిక యనునది. ఇతడచ్చటచ్చట చంద్రికను ఖండించుచు మా పూర్వవంశీయునితో కయ్యము చాలును అనుచు తన వ్యాఖ్యను ఉపసంహరించు చుండును. టీ. కె. వి. యస్. సు. అభ్యవహారము-ఆర్షపద్ధతి :- విషయములు : భాన్యభేద నిరూపణము, దంపు, వంట, వంటకు పాత్ర విశేషము, భోజనము, తదితర ప్రసక్తాంశములు. లోకములో తరతమభావముచే ( తారతమ్యముచే) మానవులలో కొందరు జొన్నలు, మరికొందరు గంటలు, సన్న ధాన్యము, ముతక ధాన్యము, నల్ల ధాన్యము, గోధుమలు మున్నతు ధాన్యవిశేషములు అన్నము, రొట్టె, జావ మున్నగు రూపభేదములచే ఎట్లు భుజించుచుండిరో అటులనే దేవతలలోగూడ అగ్ని (గృహపతి)కి నల్లధాన్యము (కృష్ణ వ్రిహులు) తో చేయబడిన పురోడాశము (య (యజ్ఞార్థ మయిన అపూపము) ; సోమునకు చాము. బియ్యపు అన్నము (చరువు) ; సవితకు అశువ్రీహుల (60 దినముల వంట