పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/305

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినవ గుప్తుడు మైనటుల తెలియుచున్నది. "భైరవ స్తవ” మున, 4088వ సంవత్సరమున పుష్యబహుళ దశమితిథిని అది పూర్తిచేయ బడినటులను, “క్రమ స్తోత్ర"మున 4066 సంవత్సర మార్గ శీర్ష కృష్ణ నవమియం దది పూర్తిచేయబడినటులను `తెలిపి యున్నాడు. అందుచే 4066 నుండి 4090 వరకును ఇతడు గ్రంథములను రచించుచుండెనని తెలియుచున్నది. అది క్రీ. శ. 800-1014 అగుచున్నది. ఇతని గ్రంథములలో మొదటిది క్రమస్తోత్ర మనియే చెప్పుటకు వీలు లేదు. అదియునుగాక నితడు పెక్కుమంది గురువుల నాశ్రయించి అనేక విషయములలో నారి తేరిన వాడు. దీని కెంత లేదన్నను 80 లేక 40 సంవత్సరముల కాలము పట్టి యుండవలయును. అందుచే నితడు క్రీ. శ. 950.960 సంవత్సరములకు మధ్య జన్మించి యుండవలయును. విద్యాభ్యాసము: అభినవగుప్తపాదనామ నిర్వచనము: అతి బాల్యమున నే తలిదండ్రు లితనిని సమీపమున నుండు పాఠశాలకు బంపిరి. అప్పటి నుండియే ఇతని గొప్పతనము బయలుపడుచుండెను. ఇతని నవనవోన్మేషమగు బుద్ధి వై భవమునకును వాగ్మిత్వమునకును ముగ్ధులై, ఉపా ధ్యాయు లితనిని పతంజలియపరావతారమని నిశ్చయించి, "అభినవ గుప్తపాదుడే" (నూతన పతంజలియే) ఇతడని, ఇతని నామధేయమును సమన్వయ మొనర్చిరి. మరియు సహాధ్యాయు లందరును ఇతనిని జూచి మహాసర్పమును జూచినటుల భయభ్రాంతు లగుచుండిరి. అందుచే నితడు అందరిచేతను గుప్తపాదుడగు నాదిశేషుని అపరావతార ముగనే భావింపబడుచుండెను. "బాలవలభిభుజం గు" డని ఇతనిని గురువులు కీర్తించినటులు కావ్యప్రకాశ వ్యాఖ్యాన మగు బాలబోధినిలో నున్నది. కనుక ఇతని సమగ్ర నామ ధేయము "అభినవ గుప్తపాదు" డనుటయే యుక్తము, "భట్టాభినవగుప్తార్య పాద ప్రోక్తేన వర్త్మవా" అని కీర్తిం చుటయు దీని కనుకూలముగనే యున్నది.

ఇతని ఆచార్యులు : “బహుభ్యః శ్రోతవ్యం ; బహుధా శ్రోతవ్యమ్" అను నార్యోక్తిని ఆచరణములో పెట్టగలిగిన దిట్ట ఇతడే. ఆ యా సంప్రదాయములలో మిక్కిలి ప్రవీ ణులగు నాచార్య మహోదయుల నాశ్రయించి, మధుక ర వృత్తితో సర్వశాస్త్ర విషయ మకరందముల నితడు ఆస్వాదించెను. వేయేల, నాస్తికులగు జైన బౌద్ధాదుల 246 నాశ్రయించి, వారల కడ వారి మత పరమార్థములను దెలిసికొనెను. ఇటుల నితడు సర్వశాస్త్రముల యందును అద్వితీయ పాండిత్య మండితుడై విలసిల్లెను. ఆచార్యుల నామధేయములు వారు బోధించిన శాస్త్రములు 1. నరసింహగు ప్త (వీరితండ్రి) వ్యాకరణము 2. వామనాథుడు - ద్వైతాద్వైత తంత్రములు ద్వైత శైవము బ్రహ్మవిద్య క్రమ-త్రికదర్శనములు. ధ్వనిమార్గము. లి. భూతిరాజతనయుడు 4. భూతిరాజు 5. లక్ష్మణగుప్త 6. భట్టేందురాజు 7. భట్టతోతుడు నాట్యశాస్త్రము ఇతవికుటుంబము, దానిపరిస్థితులు: ఇతని తల్లిదండ్రులే కాక, ఇతనికి వామనగుప్తుడు అనునొక పినతండ్రియు, మనోరథుడను నొక తమ్ముడును, క్షేముడు, ఉత్పలుడు, అభినవుడు, చక్రకుడు, పద్మగుప్తుడు అను నైదుగురు పిననండ్రి కొడుకులును గలరు. గురుపంక్తిలో పినతండ్రి పేరుగూడ నున్నది. వారు అలంకార శాస్త్రగ్రంథముల విరచించినటుల, అభినవభారతిలో ఇతడు ఉదాహరించి యున్నాడు. సోదరులందరును సకలశాస్త్రపారగులగుట మాత్రమేగాక, ఉత్తమ గ్రంథ రచయితలై యున్నటుల దెలియుచున్నది. "స్పన్దనిర్ణయ" మను శైవగ్రంథమును క్షేముడు (క్షేమరాజు) అను సోదరుడు విరచించేను. ఇట్లు వీరి కుటుంబములోనివా రందరును ప్రౌఢశాస్త్ర ప్రవీణులును, అత్యంత శివభక్తి సమన్వితులునునై యుండి రని తెలియుచున్నది. ఇతడు సాహిత్యాధ్యయనము చేయుచుండినపుడే ఇతని తల్లి చనిపోయినది. అప్పటికి ఇతని తండ్రి, వయసు చెల్లనివాడయ్యు, వివాహాంతరమును చేసికొన నొల్లక పరమ విరక్తుడై యుండెను. ఈ సంఘటనచే మన అభినవ గుప్తుల మనస్సు ఫారలౌకిక శ్రేయోను చింతనాదులందే నిమగ్నమయ్యెను. అందుచే నితడు వివాహముచేసికొనుట కంగీకరింపలేదు. అటుపై ఆగమవిజ్ఞానసంపాదనకై కడగి, అందు సంపూర్ణమయిన విజ్ఞానమును నార్జించుటయేగాక, తద్యోగసిద్ధులై తాము తరించి, ఇతరులను గూడ తరింప జేసిరి. ఇతని అతివిపులమైన తంత్రాలోకము ఇతని అస