పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/304

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాత్రమే వేసి ముగింతురు. అంతటితో అభినయము ముగియుచున్నది. భామాకలాపము, ఉషాపరిణయము, రుక్మాంగద మొదలైన భాగవతములందు నాలుగు బాణ ముల ప్రయోగము, అభినయముతరువాత . ఐదవబాణము ప్రయోగమునకు బదులుగా 'మూర్ఛపట్టు' అభినయింప బడుచున్నది. మరణము నిషేధము గాన ' మూర్ఛపట్టు' తో ముగించుచున్నారు. భాగవత నాట కాదు లందు నాయిక చెలిక త్తెలు ఆమె యొద్దనే యుండుటచే, ఉప శాంతిని అభినయింతురు. భరతనాట్య ప్రదర్శన మునందు ఏక పాత్రాభినయమగుటచే అట్టి అవకాశము లేదుగనుక నే ‘నవమల్లిక' తో సమా ప్తమగుచున్నది. ఇదియే భారతీయ నృత్యకళకు తలమానికమైన రసా భినయము యొక్క సంక్షిప్తగాథ. నెం. స. అభినవగు ప్తుడు :- (కాశ్మీరము - క్రీ. శ. 11 న శతాబ్దము) "సరస్వత్యా స్తత్త్వం కవి సహృదయాఖ్యం విజయతామ్" అని కీర్తించినటుల కవి సార్వభౌములగుట చేత సరస్వతీతత్వమూర్తులగు శ్రీమ దభినవగుప్తపాదా చార్యులవారు, శాస్త్ర సర్వస్వము నెల్లరికిని ప్రసాదించు టకై, అవతరించిన శ్రీపతంజలి మహర్షివలె నొకయవతార మనుటకు సందియము లేదు. ఈ మహామహోదయుడు - కవిసార్వభౌముడుగను, ధ్వనిమార్గ ప్రవర్తనాచార్యుడుగను, నాట్యశాస్త్ర విశదీ కరణ ప్రవీణుడుగను, కాశ్మీర శైవ సంప్రదాయ మగు ప్రత్యభిజ్ఞాదర్శనమునకు మూల సమ్యాయమానుడు గను, నాలుగు వేషములు ధరించి లౌకిక, వైదిక కళా విద్యాస్థానరంగములయం దన్నిటియందును తన అసాధా రణ ప్రతిభా విశేషములను ప్రదర్శించి, చతుర్విధ గ్రంథ రచనాభినయ చాతుర్యమున సకల సహృదయహృదయ ముల వికసింపజేసిన ఒకానొక అసాధారణవ్యక్తి. వీరిని గూర్చి సమగ్రముగ దెలిసికొన వలయుననిన నెవ్వరికిని సాధ్యము గాదు. అయినను పై నాలుగు విధములైన విద్యా ప్రభేదములలో వారు విరచించిన ఉత్త మో త్తమ గ్రంథముల పరిశీలించితిమేని, వీరి ప్రభావమును, ప్రతిభా. సంపత్తిని, వీరు లోకమున కనుగ్రహించిన ప్రబోధమును కొంతవరకు గుర్తెరుగ వచ్చును. ఆయా విభాగములలో. 245 అధినఐగుప్తుడు వీరు రచించిన ప్రబంధములు ఆదర్శప్రాయములై విరాజిల్లు చున్నవి. సరస్వతీ విహారరంగస్థల మగు కాశ్మీర మున శివభక్తి పరిపూతమగు నొక విద్వత్కుటుంబమున క్రీ. శ. 85) నుండి 988 సంవత్సరములలోపల వీరు జన్మించికి. వీరి వంశకూటస్థుడగు అత్రిగుప్తుడు గంగాయమున లకు మధ్యనుండు కాజ్యకుబ్జమునకు రాజగు యశోవర్మ (క్రీ. శ. 720.740) రాజ్యకాలమున "అంత ర్వేది" యను గ్రామమున నివసించుచుండెను. అతడు సర్వశాస్త్ర పొరుగు డగుటయేకాక శైవాగమములయందు అవ్వ తీయ ప్రవచనాచార్యుడై విరాజిల్లుచుండెను. కాశ్మీర రాజగు లలితాదిత్యుడు (క్రీ.శ.725-761) యశో వర్మను జయించినప్పుడు అత్రిగుప్తుని పాండిత్యమునకు సంతసించి కాశ్మీరమునకు ఇతనిని తోడ్కొని చని, ఇతని నిత్యనివాసమునకై వితస్తా (Thelam) నదీతీరమున శీతాంశుమాలి దేవాలయమున కెదుట సముచితమైన యొక గృహమును నిర్మించి, ఆ నదీ మూల భాగముననే ఒక జాగీరును గూడ కల్పించి మిక్కిలి గారవించెను. వీరి కుటుంబమున “వరాహగుప్తుడు" అను మహాను భావుడు అవతరించెను. అతని శివభక్తికి మెచ్చి అతనిపై పరమ శివుడు విశేష కటాక్షమును ప్రసరింపజేసెను. అతని ఆత్మ జుడు “చుఖులక” అను ఉపనామముగల నరసింహగుప్త సక ల శాస్త్రములయందును అసమాన పాండిత్యమును గలిగినవా డగుటయేగాక, అత్యంత శివభక్తి పరాయ ణుడైయుండెను. అతనిభార్య విమలకళ. మహాసాధ్వియు, సవాతన ధర్మాచార వరాయణయునై యుండెను. వీరిట్లు సనాతనధర్మ పరాయణులై, విద్యావ్యాసంగైక తప్ప రులై, శివభక్తి భరితులై, అతి పవిత్రమగు దాంపత్య మును నిర్వహించుచుండిరి. ఆదివ్యదంపతుల కే. “యోగినీ భూ” అని ప్రసిద్ధిచెందిన మన అభినవగుప్తపాదు డుదయించెను. జననకాల నిర్ణయము : కాశ్మీర సంప్రదాయమున సప్తర్షిశకము వాడుకలో నున్నది. అది కలియుగారంభ మునకు 25 సంవత్సరముల తరువాత నారంభమగుచున్నది. అందుచే "బృహతీ విమర్శినీ" గ్రంథము నందు ఇతడు. చెప్పిన రీతిగ, 4080 సప్తర్షి వర్షమున ఆ గ్రంథము సమాన