పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/303

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినయము స్వామికి ఇష్టమైన విధమున అలంకరించుకొని యున్నాను. అతనికొఱకు మంచిగంధము నూరియుంచితిని. అతని కిష్టమైన అలంకారములు సిద్ధపరచియుంచితిని. షడ్రసోపేతమైన భోజ్యములను సిద్ధపరచితిని. కేళీగృహము నలంకరించి యుంచితిని. హారతి పట్టుటకు అన్నియును సిద్ధపరచితిని. స్వామి నడిచెడి బాటయందు పూవులబరుచుటకు పుష్ప ములను సిద్ధపరిచితిని. వీనులకు విందుగొల్పు సంగీతము వినిపించుటకు శ్రుతి చేసి వీణను సిద్ధముగా నుంచితిని. తలవాకిట స్వామికొరకు వేచియున్నాను. - 5. మంచిదినము నేడే చల్లనిపిల్ల వాయువులు మెల్లన వీచుచున్నవి. 6. మంచిదినము నేడే-'ఝం'కార ధ్వనుల జేయుచు, తుమ్మెదలు, పూచిన మామిడి పూగుత్తులనుండి మకరందమును గ్రోలుచున్నవి. 7. మంచిదినము నేడే కోకిలలు 'కుహూ' రవముల పంచమస్వరములో పలుకుచున్నవి. 8. మంచిదినమునేడే———చంద్రోదయమైనది. ఇట్లు ఆయా భావములకు తగినట్లు హస్తములుపట్టి అభినయించుట ఆంగిక ప్రధానమైనట్టి అభినయమగును. ఇక సంచారుల నభినయించు తీరు : (1) ఔత్సుక్యము (2) హర్షము (8) శంక (4) విత ర్కము. ఔత్సుక్యమనగా ఉత్సాహము. తాన భిలషించిన వస్తువు లభింపకముం దొక క్షణమైనను తాళజాలకపోవు టయేఔత్సుక్యము. ‘ఔశ్సుక్యము నకు అనుభావములు. (1) సంతాపము (మన్మథతాపము), (2) మనశ్చింత, నిట్టూర్పు, (4) ఎటకై నను పోబూనుట. అభినయమందు చూపవలసిన భావములు : 1. మనస్సు కాక జెందుట, 2. వేగముగ నడుచుట. (ఇది 1-వ సాత్త్విక భావము. అనగా “ స్తంభము') 3. నిశ్వాసములు ప్రదర్శించుట. 4. శరీరము భారమగుట. (4వ సాత్వికము - స్వర భేదము). 5. నిద్ర 6. చింతించుట. ( 7.వ సాత్త్వికము - అశ్రువులు. మొదలైనవి పట్టవలెను.) ఇందు : - వేగముగ నడచుటయందు : 1వ సాత్విక భావము స్తంభమును పట్టవలసిన తీరు ఎట్లన స్తంభమనగా— 244 కదలకుండుట లేక అనురాగముచే చలించకుండ నుండుట అని అర్ధము. ఇది పాదములందు బుట్టును. నాయిక 'వేగము' నభినయింపవలెను. గాని పాదములు మాత్రము ఉన్నస్థానమునుండి కదలుటలేదు. అట్టితరి శరీరమునందు వణకుబుట్టి శరీరము కంపించును. ఈ భావప్రదర్శనము వలన ఆవేగము, ఆతురత వెల్లడియగును. దీనివలన నాయిక మనస్సులోని ఆశ్రము వెల్లడియగుచున్నది. ఇది పూర్తిగా సాత్త్విక ప్రధానమైనట్టి భావప్రకటనము గాన ఈ విధముగా పట్టబడును. ఆంగికమైనచో నాయిక వడివడిగా అడుగులు వేయుట ద్వారా మనస్సులోని ఆందో ళన వెల్లడిజేయును. ఇదియే రెంటియందలి భేదము. శరీరము భారమగుట : ఇదు 44వ సాత్విక భావ ము స్వర భేదము అభినయింపవలెనని తెలుపబడినది. అదెట్లన: స్వర భేదము_సుఖాదులచే గలుగునట్టిది. ఇందు డగ్గుత్తిక మొదలైనవి గల్గును. డగ్గుత్తిక అనగా గద్గద స్వరము. ఇది వాక్కునందు ప్రదర్శింపబడునట్టిది. శరీరము భారమగు టచే... నాయిక ఉచ్ఛ్వాస, నిశ్వాసములు ప్రదర్శించుచు మెల్లన కంఠమును మార్చి గానము చేయుటవలన ప్రదర్శించును. అట్లే - ‘చింతించుట' యందు 7 వ సాత్వికము. అశ్రువుల ప్రదర్శనము : విచార మధిక మై అశ్రువులు రాల్చుట, ఆనంద బాష్ప ములు రాల్చుట - అని రెండువిధములుగా 'అశ్రువుల' అభినయము ప్రదర్శింపబడును. కన్నీరు విదుల్చుట, కనులు తుడుచుకొనుట -- వలన అభినయింపబడును. ఇట్లే ప్రతి 'సంచారి' యును అభినయింపబడును. ఈ అభినయము సాత్విక ప్రధానమైన సంచారుల ప్రదర్శనము. మన్మథ పంచబాణముల అభినయమును గూర్చి కొన్ని వివరములు : నాయి కాభినయమందు నాలుగు బాణములు