పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/302

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందరికి చల్లనైన ఆ చందమామ నాపాలిటి కనలమాయె నయ్యో ! చెలియ ! ముందు నే నెవ్వరికి పొందెడ బాపితినో అందుకు నే నీలా గై తినో ఓ చెలియరో. (8) స్వాధీన పతిక తన ఆజ్ఞల ననుసరించు పతిగల నాయిక.

ఉదా : ఎందుదాచుకొందు నిన్ను నేమి సేతు నేను అందమైన నీమోము అయ్యారే ముద్దు గుల్కుచున్నది. ముదముతో నాముద్దు మువ్వగోపాలసామి గుదిగొన్న తమకము.. గూడి యిద్దరము నిదురపరవశమున వదలునో కౌగిళ్ళు పదిలముగ నాజడను పట్టి కట్టుకొందునా ? పదార్థాభినయము, విశేషాభినయము అభినయమందు ప్రతిమాటకు సరియగునట్టి అర్థమును స్ఫురింప జేయుచు హస్తములను పట్టుట పదార్థాభినయము. ఉదా : 'గోవు'-నాట్యమందు 'గోవు'ను అభినయించు నప్పుడు 'సింహముఖ” హస్తమునుబట్టి దాని ఆకారమును అనగా గోవుయొక్క ముఖము, కొమ్ములను జూపుట. విశేషాభినయము : ఒకే విషయమును అనేక విధము లుగా వర్ణించుట. ఉదా : 'కమలాక్షుడు" అ (1) తామర రేకులవంటి కన్నులు గలవాడు. (2) కెంద మ్మి రేకులవంటి యెరుపుగలిగిన నేత్రములు గలవాడు. (8) సూర్యోదయకాలమున సూర్యరశ్మి సోకినంతనే వికసించు కమలముల రేకులవంటి నేత్రములు గలవాడు. (4) తామర పువ్వువలె వికసించిన నేత్రములు కల వాడు. (5) భ్రమరముల నాకర్షించు కమలములవంటి నేత్ర ములు కలవాడు. ఇట్లు 'కమలాథుడు' అను మాటకు అనేక విశేషణ ములు గల్పించి అభినయించుట విశేషాభినయము, అభినయము గూర్చు విధము : ఒక వదమును అభిన యించునప్పుడుగాని, అభినయమును గూర్చు నప్పుడు 243 అభినయము గాని - ముందుగా అపనమును పూర్తిగా జదివి, అంధలి నాయికా నాయకు లెట్టివారో తెలిసికొనవలెను. అటుపై అందలి శృంగారమును గూర్చి, అవస్థాభేదములను గూర్చి, అలంకారములను పర్చి, సంచారీ భావములను రి చక్కగా తెలిసికొని పిమ్మట అభినయము కల్పింపవలెను. భావములను కూర్చునప్పుడు పల్లవియందే పదములో నుండు అన్ని భావములు అన్వయమగునటుల చేయవల యును. పల్లవి, పదమునకు జీవము. అభినయమును ూర్చు విధము తెల్పుటకుగాను ఇట నొక పదము ఉదా హరణముగా నీయబడు చున్నది. పదము : ‘మంచిదినము నేడే | మహరాజుగ రమ్మనవే' పదములోని భావము : తన్ను విడనాడిన నాయకుడు మరల తనవద్దకు వచ్చుచున్నాడని దూతిక ద్వారమున ఎరిగిన నాయిక, విరహోత్కంఠితయై నాయకుని రమ్మని ప్రార్థించుచున్నది. నాయిక : స్వీయ. నాయకుడు : కరుడు. ఈర్ష్యామాన విప్రలంభ శృంగారము. సంచారులు : శంక, వితర్కము, హర్షము, అమర్షము. వితర్కము, ఔత్సుక్యము, ఆనందభైరవి - త్రిపుట ప. మంచిదినము నేడే మహారాజుగా రమ్మనవే. ఔత్సుక్యము, హర్షము. అను. పొంచిజూచు పేలే ? పొలతీ ? మువ్వగోపాలుడు. శంక, వితర్కము - హర్షము, ఔత్సుక్యము. అభినయవిధానము : ఆంగిక ప్రధానమైనది. "మంచిదినము నేడే మహరాజుగ రమ్మనవే” 1. నేడు మంచిదినము మహరాజువ లెరమ్మనవే. 2. నేడు మంచిదినము ఇప్పుడే రమ్మనవే. 8. నేడు మంచిదినము సర్వాలంకృతుడై రమ్మనవే. 4. నేడుమంచిదినమునే నతని రాక కెదురుజూచు చున్నాను రమ్మనవే. ఎట్లు ? : "నేను సర్వసిద్ధమైయున్నాను.