పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/301

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినయము అను. మేడలు మిద్దెలు మెండు గలిగిననేమి ఈడై న విభునితో - నెనసి యుండకపోతే. ఆ. అతివ మిక్కిలి రూష - వతియైతేనేమి సతతము పతిభక్తి - సలిపితేనేమి, అతులిత వ్రతములు - ఆచరించిన నేమి Q పతితోడ హితవుగా పలుకు లేకపోతే ॥ (2) వరకీయ ః భర్త యున్నను పర పురుషులయం దనురాగము గల్గినట్టి నాయిక. - ఉదా : ప. అత్తవా రూరికి అంపేరు మావారు అయ్యయో ఇక నేనేమి నేయుదునే ఆను. కత్తి కోతగాడు మగడేమి జేసునో పొత్తు మరువకుండు పోయివచ్చెదసామి ॥ (3) సామాన్య : ద్రవ్యార్జనమునకు పరపురుషుల యందు అనురాగము ప్రదర్శించునట్టిది. ఉదా : ప. పూసలోని దారమువలె యెంత చేసెనే నమ్మినందుకు ఆ. ప. మోస మేమని యడిగితే తగని రోసమే వేణుగోపాలుడు అటకమీద సరిగ చీరచాటుగ నా పె కిచ్చి సేవించు కొనెనట కటకటా యితని పేరు దలచిన కాశియాత్ర పోయిన తీరదు. (1) ప్రోషిత భర్తృక పతి దేశాంతర మందుండగా వేదన పడునట్టిది. ఉదా : భామరో ! ఊరికి బయలు దేరెడి వేళ ప్రేమమీర నాసామి పిలిచి చెప్పినమాట ఏమని తెల్పుదు ఏలాగు తాళుదు ఏమి సేతునే చెలియ ॥ "అన్నమందక అతి వెత నొందకు కన్నీరు గార్చకు కలవరింపకు” మని ఎన్నెన్నొ విధముల హితవుల దెల్పుచు కన్నీరు గార్చుచు కాంతుడు చెప్పినమాట. (2) వాసక సజ్జిక : ప్రియుడు వచ్చుచున్నాడని తెలిసి, తా నలంకరించుకొని అనుభవయోగ్యములైన పదార్థము లను సిద్ధపరుచునట్టిది. ఉదా : అక్కట మరుపాయె నేర మరేమాయె అక్కర దెలిసి రావై తి వదేమాయె ॥ ఏడాది పండుగ నేడని యెంచి యీ మేడ శృంగారించితి జలకమ్ముల నాడి వల్వయు ధరించితి కస్తూరిబొట్టు వాడిగా నొనరించితి నాడునాటికి వేడుకల్ బల్పోడిమిగ సేయుదామని యా వాడవాడల చేడె అంపిన లేడు లేడని మరలివచ్చిరి ॥ (3) విరహోత్కంఠిత : సంకేతస్థలంబునకు ప్రియుడు రాలేదని చింతించునది. ఉదా : సామిని రమ్మనవే సఖియరో సామాన్య దొరగాడే ॥ (4) అభిసారిక: ప్రియుని గూర్చి తాను బోవునది లేక ప్రియుని తన యొద్దకు రప్పించుకొనునది. ఉదా : మగువ తన కేళికా మందిరము వెడలెను. వగకాడ మాకంచి వరద తెల్లవారె ననుచు ॥ (i) విప్రలబ్ధి: ప్రియునిచే వంచింపబడి చింతించునట్టిది. ఉదా : కథితసమయే ఒపిహరి రహహ! నయ యౌవనం మమ విఫలమీద మమలరూప మపి యౌవనం యామి హే! క మిహళరణం. సఖీజన వచన వంచితా మహమ్ | (6) ఖండిత: అన్యస్త్రీ సంభోగ చిహ్నములు గల్గి ప్రాతః కాలమున ఇంటికి వచ్చిన నాయకుని జూచి కోపించు నాయిక. ఉదా : చల్లనాయెనా మనసు చల్లనాయెనా చల్ల నాయె ప్రాణేశ స్వామి మువ్వగోపాలా, వద్దికి రావేమోయి వాడిన ముఖమేడదోయి నిద్దుర కన్ను రెప్పలపై నిండియున్న దేమోయి అద్దపు చెక్కిలి నొక్కి ముద్దిడుకున్న దెవతోయి దిద్దిన కస్తూరీబొట్టు చెదరెనేమో దెలుపవోయి. (7) కలహాంతరిత పతిని అవమానించి పిమ్మట పశ్చాత్తాపపడు నట్టిది.

- ఉదా : మోసమాయెనే నాబుద్ధికి సమాయెనే మోసమాయె ఏమి సేతు మువ్వగోపాలుడు నేడు మ్రొక్కి వేడిన రాడే ఓ చెలియరో. 242