పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/298

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆహార్యము : నృత్య, నాట కాదులందు ఆ యా సన్ని వేళములకు తగినట్లు పాత్రలు అలంకారాదులను ధరిం చుట, రంగాలంకరణము ఆహార్య మనబడును. సాత్త్వికము : భారతీయ నృత్యకళయందు ప్రధాన మైనట్టిది సాత్త్వికాభినయము. సత్వగుణ ప్రధాన మైనట్టిది సాత్త్వికము. ఒక దృశ్యమును మనము జూచినప్పుడు గాని, ఒక సంఘటననుగూర్చి వినినప్పుడుగాని మన మనస్సు పొందు అనుభూతియే సాత్త్వికము. ఈ సాత్త్వికక భావ ములు ఎనిమిది విధములు : స్తంభము, ప్రళయము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, వేవధువు, అశ్రువు వైస్వర్యము, సాత్త్విక భావములను గూర్చి రసమం జరియందు ముచ్చటైన శ్లోకములో చెప్పబడియున్నది. "భేదో వాచి, దృశో ర్జలం, కుచతటే స్వేదః, ప్రకమ్పో 2ధరే, పాడ్లు ర్గణ్ణతటే, తనౌ చ పులక వ్రాతో, లయ శ్చేతసి, ఆలస్యం నయనద్వయే, చరణయోః _స్తమ్భః, సముజ్జృమృతే; తక్కిం రాజపథే ప్రజేన్ద్రతనయః కృష్ణ స్వయా22లోకితః ? సఖి నాయికతో ననుచున్నది: ఓ మందయానా ! నీ మాటలయందు గాద్గద్యము. కన్నులందు బాష్పములు, చనుదరియందు చెమర్చుట, మోవియందు ఆదరుపాటు, చెక్కిలియందు తెల్లదనము, మేనియందు పులకరింత, కనులయందు మాంద్యము, పాదములయందు మ్రానుపాటు ఒకటినిమించి ఒకటి అతిశ యిల్లుచున్నది. ప్రజకాంతలు యుల్లములు కొల్లగొన్న నవ నీత చోరుడు నీ కంటబడెనా యేమీ? లేనిచో అఖిల సాత్త్విక భావములు ఒకేవేళ ఏల యుదయించును ? పై శ్లోకమువలన సాత్వికము లన నేమియో అవి యెట్లు గల్గునో తెలియుచున్నది. సాత్త్వికములు మనస్సు నందు బుట్టి మనయందు గల్గు మార్పులు. నృత్యమందు నవరసాభినయమునకుగాని, పదముల అభినయమునకు గాని సాత్త్విక ప్రదర్శనము ముఖ్యము. సాత్త్వికమందు నర్తకుడు ముందు తానా భావమునందు లీనమై అనుభ 239 అభినయము వించి, అభినయద్వారమున ప్రదర్శించి మనచే అనుభ వింప జేయును. ఆంగికమందు నర్తకుడు తానా భావము నందు ఐక్యము కానవసరములేదు. అభినయింపవలసిన గీతముయొక్క అర్థములు తీసికొని హస్తములద్వారా వ్యాఖ్యానము చేయును. కనుకనే శాస్త్రము తెలిసిన పండితులు ఆంగిక ప్రధానమైన నృత్యమునకు తక్కువ స్థానమును, అనుభవయోగ్యమైన సాత్త్వికమనకు అగ్ర స్థానమునిచ్చిరి. పదాభినయమందు సాత్త్విక ముముఖ్యము. నాట్యమందు నవరసములు అభినయింపబడినను, "రతి" స్థాయిగాగల శృంగారమందువలె విజృంభించి అభినయింప గల అవకాశ మితర రసములందు లేదు. కనుకనే పెద్దలు సృష్టి కాధారమైన శృంగారమునందే పదరచనలు చేసిరి. నృత్య నాటకములందు, భాగవత, కలాప, యక్షగానము లందు ఇతర రసముల అభినయమునకు అవకాశ మెట్లు న్నను, ఛాయగానైనను శృంగారము లేనిదే ఆ అభినయ ముండుట అరుదు. అట్లే శృంగారము నభినయించు నప్పు డును హాస్య, అద్భుత, భయాన కాది రసములు ఛాయలుగా వచ్చుటయును గలదు. బీభత్సము తప్ప ఇతర రసములు అచ్చటచ్చట వచ్చి సంచారి భావములకు మెరుగులు పెట్టి అభినయమునకు అలంకారములుగా ఉపయోగపడును. నవరసములు (1) శృంగారము (2) వీరము (8) కరుణము వాటి స్థాయి భావములు రతి ఉత్సాహము శోకము (4) అద్భుతము విస్మయము (5) హాస్యము హాసము (6) భయానకము భయము జుగుప్స క్రోధము (7) బీభత్సము (8) రౌద్రము (9) శాంతము శమము వీటిలో అభినయమునకు ముఖ్యమైనది శృంగారము. - D శృంగారాభినయము సాత్వతి, ఆరభటి, కైశికి, భారతి అనెడి చతుర్విధ వృత్తులలో కై శికీవృత్తియందు మాత్రమే ప్రదర్శింపబడును. శృంగారము :- సంభోగము, విప్రలంభము అను ఇరు తెగులు.