పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/291

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినయ దర్పణము పై విషయమునుబట్టి, 'అభినయ దర్పణము' నాల్గు వేల శ్లోకములుగల భరతార్ణవమునకు సంక్షిప్త గ్రంథమని యైనను చెప్పవచ్చును. లేదా భరతార్ణవమునందలి నాట్యశాస్త్రార్థములను సంగ్రహించి, 'అభినయద ర్పణ' మను నామాంతరముగల మరియొక గ్రంథమును వెల యించెనని యైనను చెప్పవచ్చును. రెండవ విషయమే నిజము కావచ్చునని తోచుచున్నది. 'భరతసారము, భగవ ద్గీతా సారము' మొదలగు గ్రంథములవలె మొదటిదే నిజ మైనచో ఇదియే 'భరతార్ణవసార మను పేరిట వెలసి యుండెడిది. అట్లుగాక ప్రత్యేకముగా నామాంతరము వహించుటవల్ల, ఇది నందికేశ్వరకృత మగు రెండవ గ్రంథమని చెప్పుటయే యుక్తము. 'అభినయ దర్పణము' అంగికాభినయాత్మక మయిన గ్రంథము . ఈవిషయమునే కర్త ఆంగికం భువనం యస్య' అను ప్రథమశ్లోకమున నే ఉదాహరించినట్లు తోచుచున్నది, నాట్యశాస్త్రార్ధము 'నాట్యం నృత్తం నృత్య మితి, మునిభిః పరికీ ర్తితం' అని త్రివిధముగా విభాగించి చెప్ప బడినది. 'వాట్యం తన్నాటకేష్వేవ యోజ్యం పూర్వ కథాయుతం', (అభి. ద. 10 శ్లో.) అని యుండుటచే నాట్యము నాటకములందే ఉపయుక్తమగును. ఇక నృత్త, నృత్యములు ఆనుషంగికముగా అందు ప్రవర్తించునన వచ్చును. నృత్తము కేవలము ఆంగికమై 'రసభావ విహీ నంతు నృత్తమిత్యభిధీయతే' (11 శ్లో.) అని చెప్పబడినది. నృత్యము, ఆంగిక, సాత్త్వికాభినయాత్మకమై, 'రసభావ వ్యంజ కాదియుతం నృత్య మితీర్యతే' (11) అని కీర్తింప బడినది. అందుచే నిది, నృత్యగ్రంథ మనతగి యున్నది. “ద్రష్టవ్యే నాట్యనృత్యే చ పర్వకాలే విశేషతః... నృత్యం తత్ర మహేంద్రాణా, మభిషేకే మహోత్సవే... తత్ర నృత్యం మహారాజ సభాయాం కల్పయేత్సదా"(17) అను శ్లోక పాదములచే అభినయదర్పణము నృత్య గ్రంథమని ఏర్పడును. ఆంధ్ర దేశమందు సుప్రసిద్ధివడసిన కూచిపూడివారి కేమి, నిన్న మొన్నటివరకు తెలుగు దేశమును నాట్యరసానంద ములో ముంచి తేల్చిన వేశ్యాజనమునకేమి, నృత్య విషయమున ఈ అభినయదర్పణము అధారగ్రంథమై యుండవచ్చునని, 232 'సభాకల్పతరు రాతి, వేదశాఖోపశోభితః శాస్త్రపుష్ప సమాకీర్ణ, విద్వదృమర సంయుతః 'సత్యాచారసభా, గుణోజ్జ్వల సభా సద్ధర్మకీర్తిస్సభా... 'విద్వాంసః కవయో భట్టాః సభా సప్తాంగ లక్షణం. (18, 19, 20. 26.) • అను శ్లోకములచే సులభముగా నూహింపవచ్చును. పించబడినవి. అభినయ దర్పణమునందు సభానాయక-మంత్రి లక్షణ ములు పేర్కొనబడిన పిమ్మట, రంగలక్షణమును, పాత్రా పాత్ర లక్షణములును, నట కింకిణీ లక్షణములును నిరూ అనంతరము 'మృదంగాదులు' పాత్రల బహిః ప్రాణములనియు, 'జవస్థిరత్వ రేఖాచ భ్రమరీ దృష్టి రశ్రమః మేధాశ్రద్ధావచో గీతి, స్వంతః ప్రాణా దళ స్మృతాః' (87) అని జవాదులు అంతః ప్రాణములనియు పేర్కొనబడినవి. నాట్యక్రమమును గూర్చి తెలుపుచు, 'తస్మాత్సర్వం సమాలోచ్య, పూర్వకై ర్యదుదాహృతం దేవతాప్రార్థనాదీని కృత్వా, నాట్య ముపక్రమేత్ . అని ప్రబోధించి, హస్తాద్యభినయమునకును రసమునకును గల్గు సంబంధమును నిర్దేశించుచు, 'యతో హస్త స్తతో దృష్టి, ర్యతో దృష్టి స్తతో మనః యతో మన స్తతో భావో, యతో భావ స్తతో రసః (42) అని చక్కగా పలికెను. తన గ్రంథమునకు—- "అత్ర త్వభినయన్యైవ, ప్రాధాన్య మితి కథ్యతే (48) అని అభినయ ప్రాధాన్యము నిరూపించి, ' "అభిపూర్వస్య ణీ ధాతో, రాఖ్యానార్ధన్య నిర్ణయః యస్మా త్పదార్థాన్నయతి, తస్మా దభినయః స్మృతః 44 ('అభి' యను నుపసర్గము పూర్వమందు గల 'నీ' ఇక్ అనెడు ధాతువునకు చెప్పుట యని యర్థము. పదార్థము, లను తెలుపునదిగాన నిది అభినయ మని చెప్పబడినది.) ఇట్టి అభినయము 'అంగికము, వాచికము, ఆహార్యము సాత్త్వికము అని చతుర్థాకరించి, 'అత్రా 220గికో ఒంగప్రత్యంగోపాంగ భేదా త్త్రిథా మతః' అని మరల ఆంగికాభినయము అంగ- ప్రత్యంగ - ఉపాంగ భేదములచే ముత్తెరగుల చెప్పబడి నది. తన గ్రంథమున నంది కేశ్వరుడు, 'నృత్య మాత్రోవయోగ్యాని, కథ్యంతే లక్షణైః క్రమాత్'