పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/270

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యనుడును - దేశిశబ్దముతో ప్రాకృతముల నన్నిటిని నిర్దే శించెను, “సుర తే కర్ణ మలేషు యచ్చదేశీయ భాషయా। దంపత్యోర్జల్పితం మందం, మన్మనంతం విదుర్బుధాః కామసూత్ర)"- కువలయ మాలాకర్తయైన ఉద్యోతనుడు కూడ ఈ యభిప్రాయమును వాడెను. రుద్రటుడు ప్రకృతి ప్రత్యయమూలమైన వ్యుత్పత్తిలేని శబ్దములు దేశీపదము ల నేను హేమచంద్రుడును ఈ అభిప్రాయమునే ఆమ్రే డించెను, శబ్దముల విషయమం దెట్లున్నను - భాషనుద్దేశించి నపుడు మాత్రము. దేశిశబ్దము ప్రాకృత సామాన్య వాచకమనుటయే చాలమందికి సమ్మతమైన అభి ప్రాయము, "పడమటి నాట” మాటలాడు అపభ్రంశ ములో ఎక్కువగ శౌరనేని చేరును. దాక్షిణాత్యమైన అపభ్రంశము గుజరాతు - రాజస్థానీ భాషలకు మూలము. మృచ్ఛకటికములోని శకారుడు "శకారి" యను నొక భాషాభేదమును సూచించెను. ఇది అపభ్రంశ భాషయొక్క చిరుకొమ్మయే కావచ్చును. అపభ్రంశములో ప్రసిద్ధ ము లై న ప్రసిద్ధము న కావ్యము లు అనేకములు కలవు. కాన, శరహులను కవులు క్రోడీక రించిన 'దోహాకోశము' తొట్ట తొలుతటి అపభ్రంశ కావ్యము. కనకామరుని 'కరికండ చరివు' 'సోమప్రభుని' 'కుమార పాలప్రతిబోధ”, “రామసింహు”ని "పాహుడ దోహ" మొదలైనవి - రమణీయములైన మరికొన్ని కావ్యములు. ఇంకను అనర్హములైన రచనలెన్నో యున్నవి. ప్రాకృతకవులకు భావనూత్నత ప్రధానమైన గుణము. అపభ్రంశము ముఖ్యముగ దిగంబర జైనుల భాష. శ్వేతాంబరులు గూడ కొద్దికొద్దిగ దీని నుపయోగించిరి. దిగంబర జైనుల సాహిత్య మంతయు ఇంచుమించుగా అపభ్రంశమే. "సనత్కుమార చరియ" "వరమప్పయ అనునవి (క్రీ. శ. 800) ఈ భాషలలో గల వేదాంత బోధక ములయిన ప్రాచీనగ్రంథములు. “పరమవ్పయా” అను గ్రంథమును వ్రాసినవాడు "జోయిందుడు”. హేమ చంద్రుడు కుమారపాల ప్రతిబోధను కొంత సంస్కృతము నను- కొంత ప్రాకృతమునను వ్రాసెను. అమ్మణగని వ్రాసిన సపాసనాచరియమున (క్రీ. శ. 1148) అరువది యెనిమిది అపభ్రంశగాథలు గలవు. శ్రీచంద్రుడు 211 అపభ్రంశము కథాకోశమును వ్రాసెను. దానిలో 587 అపభ్రం గాథలున్నవి. హేమవిజయుడు (క్రీ.శ. 1600) కథా రత్నాకరమును రచించెను. అందులో 258 గాథలు గలవు. వాటిలో కొన్ని ప్రాచీనహిందీ- గుజరాతీ భాషలలో కూడ నున్నవి. అపభ్రంశము ముఖ్యముగ పడమటి నాట పెరిగిన భాష. కావ్యమీమాంసయందు యాయా వరరాజ శేఖరుడు ఒక రాజదర్బారు నేర్పాటు చేసెను. అతనికి స్వయముగ ప్రాకృతాభిమానము కలదు. రాజునకు తూర్పుదిక్కున ప్రాకృతకవులు గూర్చుండ వలెనట ! అపభ్రంశకవులకు పశ్చిమదిశను నిర్ణయించెను. భూత భాషాక వులు దక్షిణదిశయందు ఆసీనులు కావలెను. (“తస్యాం రాజాసనం; తస్యచోత్తరత స్సంస్కృత కవయోని విశేరన్, పూర్వేణ ప్రాకృతాః కవయః పశ్చిమే నాఒపభ్రంశినః. కవయః; దక్షిణతో భూత భాషా కవయ స్తతః పరం భుజంగ గణికాః" - కావ్య మీమాంస) ఈ వర్ణనమును జూచినప్పుడు కవిచే నిర్దేశింపబడిన దిక్షులు కేవలము ఏదో యొకటి చెప్పవలెనని చెప్పినవి గావనియు ఆయా భాషలకు ఆయా దిక్కులందలి ప్రాధాన్యమును బట్టి నిర్దేశింపబడే ననియు స్పష్టమగును. ఆ నాటి భారత దేశము యొక్క పూర్వదిక్కున నున్న బౌద్ధులు గూడ కొందరు-అపభ్రంశమును వాడినట్లున్నది. సమ్మితీయులు అపభ్రంశమును-మహా సాంఘికులు ప్రాకృతమును- స్థవిరవాదులు పైశాచిని, ముఖ్యముగ గ్రహించి రని వినీతిదేవుని అభిప్రాయము. విక్రమోర్వశీయమునందు కాళిదాసు పురూరవునిచే కొన్ని అపభ్రంశ "చర్చిక" లు పాడించెను. ఈ భాష, పేరునకు అపభ్రంశమే గాని - ఆ వాఙ్మయములోని తీపి ఈ రచనములకు అంటినది కాదు. పురూరవుడు తీవ్రవిరహమున పిచ్చివాడై నప్పుడు హఠాత్తుగ అపభ్రంశములోనికి దిగును. ఇవి కాళిదాసు వ్రాతలు కావనియు. తరువాత నెవరో కొందరు ఆ నాటకమున వాటిని చేర్చిరనియు కొందరు విమర్శకుల వాదము. ఈ విమర్శన మెట్లున్నను, విక్రమోర్వశీ యమునందు అపభ్రంశ చర్చలను వాడుటనుబట్టి - పూర్వ కాలమున ఈ భాష, ప్రధానముగ సంగీతమునకు ఉపయోగింప బడుచుండె నని మరికొంద రండురు.. ఇది కొంతవరకు నిజమే కావచ్చును. ఇతర నాటకము