పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/240

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వర్తకస్థానమై మీదుమిక్కిలి నౌకావ్యాపారమునకు ప్రధానస్థానముగ నుండి, మహాప్రసిద్ధి కెక్కిన రేవుపట్ట ణము. వివిధ ద్వీపాంతములనుండి వ్యాపారము ఈ రేవు ద్వారమున జరుగుచుండెను. కాని కాకతీయ సామ్రా జ్యము తరువాత అస్తమించిన మోటుపల్లినుండి వర్త కులు పరస్థలముల కేగుటయు, వ్యాపారము తగ్గుటయు తటస్థించెను. ఈ రేవుపట్టణ మును వృద్ధికితీసుకొని రావలయు నని సంకల్పించిన అ న పో తా రెడ్డి మోటుపల్లి రేవునకు విజయము చేసి యాత్రికుల (ఓడవ ర్తకుల) బాధలు విచా రించి ధర్మశాసన స్తంభ మొకదానిని నెత్తించెను. ఇతని ఆజ్ఞ ప్రకార మితని మంత్రులలో నొకడగు సోమయా మాత్యుడు వర్తకులందరికిని అభయప్రదానము గావిం చెను. ముకుళపురమునకు ఏ వ ర్తకులు వచ్చి నివసింప గోరినను, వారిని గౌరవించి, వారలకు భూములను, నివేశన స్థలములను ఇప్పింతుమనియు, పన్నులకై వారి సరకులను సంగ్రహింపమనియు, వారు మరియొక స్థల మునకు పోదలచుకొన్నపుడు, వారిని నిర్బంధ పెట్టి నిలు వక స్వేచ్ఛగా పోవిడుతుమనియు శాసనము వ్రాయించి ప్రకటించెను. కొన్ని వస్తువులపై సుంకముల తీసి వేసియు, మరికొన్నిటిపై సుంకములను కొంతవరకు తగ్గించియు మరికొన్నిటిపై పూర్వపు మర్యాదలను పాటించియు, బంగారునకు సుంకము తీసివేసియు వర్తకులకు అతడు ప్రోత్సాహము నిచ్చెను. తురుష్కా క్రాంతమై, విప్లవ యుతమైన ఆంధ్రదేశము నందు నశించిన కర్షకకృషిని, పతనమొందిన వణిజుల వాణిజ్యమును ఈ విధముగ పునరుజ్జీవింప జేయుట చేత అనపోతారెడ్డి పరిపాలనము సర్వజన రంజకమై క్లామా పాత్రమైనది. ఘా తండ్రివలె ధర్మమార్గానుయాయియైన అనపోతారెడ్డి "రాజ్యం ప్రాజ్యం సుహృద్భాజ్యం యఃకురుతేఒర్థినాం” అని శాసనములందు ఉల్లేఖింపబడినట్లుగ తన రాజ్యము నందలి ముఖ్య పదవులలో బంధువులను, స్నేహితులను నిలిపి రాజ్యతంత్రము నడిపెను. వైదిక ధర్మ సంస్థాపనమే ఆళయముగాగల ఈ అన పోత మహీపతి ఆర్యధర్మములను అత్యంతాభిమానముతో పోషించెను. యవనులచే అపహరింపపడిన అగ్రహారము 181 అనపోతా రెడ్డి లను పునరుద్ధరించుటయేకాక, వేదాధ్యయన సంపన్ను లైన బ్రాహ్మణో త్తములకు తాను అనేక అగ్రహారము లను దానమొనర్చెను. పూర్వ నృపాలురచే చిర కాలము క్రింద అపహరింపబడిన కృష్ణాజిల్లాయందలి గుడివాడ తాలూకాలోని ఉప్పుగల్లు తిరిగి పూర్వపు టగ్రహారికు లకు చెందునట్లుచేసెను. వినుకొండసీమలోని నాగళ్ళ అను గ్రామమును శా. శ. 1278 లో అనపోతయ రెడ్డిగారు "కొండుశాస్త్రులంగారికి అలవణం, అకరంగా సర్వా గ్రహారంగా ధారాగృహితంచేసెను” కోడితాడిపఱ్ఱు అను గ్రామమును శా. శ. 1248 లో జమ్మలమడక పురుషో త్తమ సోమయాజికి దానమిచ్చెను. ఈవిధముగ ధార్మికు డగు ఈ అనపోతా రెడ్డి హేమాద్రి దానఖండమున చెప్పిన ప్రకారము దానముల చేసియు; వైదిక, స్మార్త, జ్యోతిష, ఆయుర్వేదాది విద్యలకు ప్రోత్సాహమిచ్చియు కీర్తనీయ చరితుడయ్యెను. సర్వజన ప్రియుడగు అనపోతారెడ్డికి కులక్రమాగతు లును, రాజనీతిజ్ఞులును అగు మంత్రుల యొక్క సహాయ సహకారములు అధికముగ తొడగూడినవి. ఇతడు రాజ్య మునకువచ్చిన ఒకటి రెండు సంవత్సరముల వరకు మల్లనయు, మల్లన స్వర్గస్థుడయిన తరువాత అతని పిన తమ్ముడును మంత్రులుగ నియుక్తులైరి. సోమయమంత్రి మోటుపల్లిని వృద్ధికి తెచ్చినవాడు. తరువాతివాడు కేశయ మల్లినాథ వేమన. ఇతడు కులక్రమాగతముగ మంత్రిత్వ మును సేనాపతిత్వమును వహించెను. అనపోత మహీళ్వ రునకు కుడిభుజమైయుండి, అతని పెక్కు విజయప్రస్థాన ములందు తోడుపడినవాడు ఇతడే. ఇతడే శా. శ. 1288, ప్లవ సం॥ శ్రావణ బహుళ పంచమీ గురువారమునాడు ధాన్యవాటిపురమునందు అనపోతయరెడ్డిగారికి ఆయు రారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కొరకును, ధనకనకవస్తు వాహన సమృద్ధికొరకును, పుత్రపౌత్రాభివృద్ధికొరకును అమరేశ్వరదేవుని పునఃప్రతిష్ఠించేను. • అనపోతా రెడ్డి యొక్క అస్థానము కవులతోను, జ్యోతిషి కులతోను, ధర్మశాస్త్రవేత్తలతోను, వేదపండితులతోను నిండియుండెను. ఇతని ఆస్థాన విద్వాంసుడు బాలసరస్వతి. అనపోతా రెడ్డి యొక్క శావన కావ్యములను (శ్లోకము లను) పెక్కింటిని కాలసరస్వతియే రచించెను. శాసనముల