పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/236

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలు, బీడీలు కట్టుట, తోళ్ళు పదును చేయుట, చెప్పులు, బూట్లు కుట్టుట, కుండలు చేయుట, తట్టలల్లుట, పొడి చేయుట బెల్లము వండుట - ఇవి ఈ జిల్లాలోని కుటీర పరిశ్రమలు. కళ్యాణదుర్గము, ధర్మవరము, పెనుగొండ, మడక సిరాతాలూ కాలలో భారీపరిశ్రమలులేవు. ఇతర తాలూ కా లలో 52 ఫ్యాక్టరీలు కలవు. మతము : హిందువులు 12,01,226. ముస్లిములు 1,48,088, క్రైస్తవులు 18,499, ఇతరులు 788. మొత్తము 18,81,558 మంది. వి శేషాంశములు : గుత్తిలోని కొండమీద గొప్ప కోటగలదు. దీనిని మరాఠా సర్దారు మురారి రావు కట్టించి నాడు. ఇదియును, మన్రో కట్టించిన ధర్మశాలయు, చరిత్ర ప్రాముఖ్యముకలవి. పెనుగొండలో విజయనగర రాజన్యులు కట్టించిన దుర్గముకలదు. బాబయ్య అను ముసల్మాను సాధువుయొక్క కోటయుండుటచే వెను గొండ దక్షిణాపథమునందలి ముస్లిములకు యాత్రాస్థల ముగా తనరారుచున్నది. హిందూపురములోని లేపాక్షి దేవాలయము శిల్పచాతుర్యముగల స్థానము. ప్రియులకు ఇచ్చటి రాతినంది విగ్రహము ఆకర్షణీయ ముగా నుండును. కళా కదిరిలోని నృసింహస్వామి కోవెలలోనికి రథోత్సవము ముగిసిన తరువాత హరిజనులకు ప్రవేశమిచ్చుట సనాత నాచారముగా వచ్చుచున్నది. కదిరి తాలూకా కటారు పల్లిలో వేమనకవి సమాధి మందిరము కలదు. అనంతపురము, గుంతకల్లు, హిందూపురము, తాడి పత్రి ఇవి మునిసిపాలిటీ గల పురములు. ధర్మవరము పట్టువస్త్రముల నిర్మాణ కేంద్రము. ధర్మవరపు చీరెలు ప్రసిద్ధిచెందినట్టివి. అప్పుడప్పుడు వజ్రములు దొరకెడు ప్రదేశముగా• గుత్తి తాలూకాలోని వజ్రకరూరు ప్రసిద్ధి కెక్కియున్నది. అనంతపుర పట్టణము : ఇది అనంతపురము జిల్లాకు, డివిజనునకు, తాలూకాకు ప్రధాన కార్య స్థానము. విస్తీర్ణము 2.70 చ. మై. జనాభా, 81,952, ఇందు పురుషులు 17.025; స్త్రీలు 14,927. ఇండ్లు 8,778. చదువుకొన్న వారు పురుషులు 10899; స్త్రీల 851. శాస్త్రకళాశాలలు 2; ఇంజనీరింగు కళాశాల 1; 23 లు 177 అనపోతనాయడు హైస్కూళ్ళు 8; శిక్షణ విద్యాలయములు 2 కలవు. గవర్నమెంటు హెడ్ క్వార్టర్సు ఆసుపత్రీ 1; గవర్న మెంటు పోలీసు ఆసుపత్రి 1; ఇంజనీరింగు కాలే! డిస్పెన్సరి 1; మ్యునిసిపాలిటీ డిస్పెన్సరీ కలవు. విజయనగర రాజయిన బుక్ష రాయలకు (క్రీ.శ. 1848- 1879) మంత్రియగు చిక్కప్ప ఒడయరు తన భార్య అయిన అనంతమ్మ పేరిట అనంతపురమునుకట్టించెను. పొం డెవంశజు డైన హనుమప్పనాయడను వాని పరాక్రమమునకు ఆళియ రామరాజు (క్రీ.శ. 1642 - 1585) సంతసించి అతనికి అనంతపురమును, మరికొన్ని గ్రామములను, పదవులను ఇచ్చెను. ఇతని కుమారుడు మలకప్ప నాయడు గోలకొండ నవాబునకు సామంతుడయ్యెను. మలకప్ప నాయడు బుక్క సముద్రమున నివసించుచు, ఒక నాడు అనంత పురములోని ఎల్లా రెడ్డిఇంటికి తాంబూలమునకుపోయెను. ఎల్లారెడ్డి సంతానసంపదను మలకప్పనాయడు చూచి, అచ్చటనివసించినచో తనకుకూడ సంతానము కలుగునని తలచి అతనినడిగి ఆస్థలము తీసికొని, అచటరాజమందిరము కట్టించి, అచ్చటనే నివసింపసాగెను. అప్పటినుండి ఆగ్రామ మునకు 'మాండే అనంతపుర' మన్న పేరువచ్చెను. మలకప్ప నాయని కుమారుడు హంపనాయడు (క్రీ.శ. 1619-1681) ఆతని కుమారుడు సిద్దప్ప నాయడు (క్రీ.శ.1881 1859), ఆతని కుమారుడు పవడప్ప (క్రీ.శ. 1859-1671) వరుసగా, రాజ్యము చేసిరి. తరువాత ఈ ప్రాంతము ఔరంగ జేబునకు స్వాధీనమయ్యెను. పిదప నిది కడప నవాబుల పాలనము లోనికివచ్చెను. పిమ్మట దీనిని మరాఠా వారు ఆక్రమించిరి. ఇంతవరకు మలకప్ప వంశజులే సామంతులుగా రాజ్యము చేయుచుండిరి. ఈ వంశము వారి నందరను టిప్పూ సుల్తాను చంపించెను. ఈ వంశములోని సిద్దప్పయనువాడు తప్పించుకొని పారిపోయి టిప్పుసుల్తాను మరణానంత రము అనంతపురమును తిరిగి స్వాధీనము చేసికొనెను (క్రీ.శ. 1789). తరువాత సిద్దప్ప నిజామునకు సామంతు డయ్యెను. పిదప నిది దత్తమండలములతోపాటు ఇంగ్లీషు వారి ఏలుబడిలోనికి వచ్చెను (క్రీ.శ.1800). అనపోతనాయడు అనపోత నాయడు : వంశజుడు. రేచర్ల గోత్రుడు, ఉపలబ్ధములగు శిలాశాస