పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/211

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్వైతము పట్టణ ప్రదేశముల అద్దె : పట్టణ ప్రదేశముల స్థానపు విలువ యందు ఒక ప్రత్యేకమైన మొనావలీ (గుత్త) లక్షణమును చూడవచ్చును. అలవాటు వలననో బద్ధకము వలననో తమకు అనువగు స్థలములందే వ్యాపారము చేయుటకు జనులు ఇష్టపడుట వలన కొనుగోలు దారులలో ఒక ప్రత్యేక వర్గమువారి వ్యాపారమునంతను పలి లాభమును కొంతవర కైనను కొన్ని స్థలములందలి వ్యాపారస్థులు అనుభవింప వచ్చును. వశపరచుకొని కొనుగోలుదారుల వస్తువుల క్రయము ఒకే ప్రదేశము నందు కేంద్రీకరింపబడుట ఎక్కువగు కొలది నగరము లందలి వ్యాపారపు సంబంధమైన స్థలముల అద్దెలు ఎక్కు వగుట జరుగును. క్వాసీ . అద్దె : కాపిటలు వస్తువులపై పెట్టిన పెట్టుబడి, భూమిపై వచ్చు అదైవంటి ప్రతిఫలమును పోలిన రాబడిని తరచుగా నొసంగును. ఇట్టి కాపిటలు వస్తువులపై వాటి యజమానులకు తప్పక క్వాసీ అద్దె ముట్టును. భూమి యొక్క కనీసపు సప్లయి ఖరీదు సున్న యను కొనినట్లే కేపిటలు వస్తువుల యొక్క కనీసపు సప్లయి ఖరీదు కూడ సున్న యనియే చెప్పవచ్చును. ఈ విధముగా ఇట్టి వస్తువులపై వచ్చు ప్రతిఫలము కూడ అద్దె స్వభావ మునే కల్గియున్నది. బి. వి. రా. అద్వైతము:- “అద్వైతమ్" ద్వే-ఇతే యస్యతత్ ద్వితం. ద్వితమేన ద్వైతమ్, నద్వైతం, అద్వైతమ్- అని విగ్రహము. రెండు విధములు లేనిది. ఒకటే విధము. అనగా విజాతీయమగు జగము మిథ్యగాన విజాతీయమే లేనందున విజాతీయ భేదము ఆత్మకు ప్రాప్తించదు. సజాతీయమగు మరియొక ఆత్మ లేనందున సజాతీయ భేదము గూడ ఆత్మకు ప్రాప్తించదు. ఆత్మ నిరవయవము, నిర్గుణము, నిష్క్రియము అగుటచేత స్వగతమున దేదియు వృక్షాదులకు శాఖాదులవలె లేనందున నాత్మకు స్వగత భేదము ప్రాప్తించదు. కాన సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమగు చిద్రూవబ్రహ్మ మొక్కటియే సత్యము; ప్రపంచమంతయు మిథ్య అని "అద్వైతము" అను పదము వలన తేలిన ఆశయము, 125 o అద్వైతము శ్రుతి, స్మృతి, పురాణేతిహాస ప్రసిద్ధము. దీనిని సదాశివుడు విష్ణువునకును, విష్ణువు చతుర్ముఖ బ్రహ్మకును, బ్రహ్మ వశిష్ఠునకును, వశిష్ఠుడు శక్తి కిని, శక్తి పరాశరునకును, పరాశరుడు వ్యాసునకును, వ్యాసుడు శుకయోగీంద్రునకును ఉపదేశించెను. తద్వార మున గౌడ పాదాచార్యుల వారును, తద్వారమున గోవింద భగవత్పాదులును, వారి వలన శ్రీ జగద్గురు శంకరభగవత్పాదులును ఉపదిష్టులై ఈ అద్వైతమును భూలోకమున వ్యాపింప జేసిరి. వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు అనేక చిత్ర విచిత్ర గాథలతో ఈ యద్వైతము నుపదేశించెను. ఆ ఉపదేశ ములే ఛందోఒద్ధములై "యోగవాసిష్ఠము" అను పేరుతో ప్రసిద్ధిగాంచి, పామరులకును, పండితులకును, ఆద రణీయములైనవి. అద్వైతమును బోధించుటకే శ్రీ వేదవ్యాసులవారు 192 అధికరణములు, 16 పాద ములు, 4 అధ్యాయములుగల “ఉత్తర మీమాంసా శాస్త్రము" రచించి యుండిరి. ఈ ఉత్తర మీమాంసా శాస్త్రము అనేక న్యాయోపబృంహితమయి యున్నది. గౌడ పాదాచార్యుల వారు ప్రధానముగ మాండూక్యోప నిషత్తు ననుసరించి దానికి వివరణముగ “ఆగమము, అద్వైతము, వై తథ్యము, ఆలాతశాంతి" అను నాలుగు ప్రకరణములుగల కారికలను రచించిరి. ఈ కారికలలో “వై తథ్య” ప్రకరణమున స్వప్నమునకు మిథ్యాత్వమును సాధించి తద్ద ృష్టాంతము ననుసరించి జగత్తునకు మిథ్యాత్వ మును స్థాపించిరి, అందు దృష్టాంత ఛాష్టాంతికమ వారు చూపిన హేతువాద పాండిత్య ప్రకర్షకు అక్ష పాదుడు, కణభుక్కు కూడ ఆశ్చర్య చకితులైరి. తికములతో శంకరులు, గోవిందభగవత్పాదులకు శిష్యులై, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, శ్రీ మద్భగవద్గీత లకు, సనత్సుజాతీయమునకు, విష్ణు సహస్రనామములకు భాష్యములను వివరించియుండిరి. ఇంతియేగాక ఉపదేశ రూపములుగను, స్తోత్రముల రూపముగను శ్రీ శంకరా చార్య స్వాములు తమ అనర్గళ కవితావల్లరి దశదిశల ప్రాకునటుల శతాధిక గ్రంథరాజములను వెలయించిరి. ప్రపంచ మిథ్యాత్వ సాధనము: జంగమ స్థావరాత్మకః మగు ఈ ప్రపంచ మింద్రియ గోచరమగుచుండ శుక్తి