పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాషలో పారిభాషిక పదజాలము స్థిరపడలేదు. అట్టి అవ్యవస్థిత పదములను శీర్షికగా పెట్టుకొన్నచో నిశ్చయజ్ఞానము కలుగదు. పలువురు పలువిధముల ఈపద ములను వాడుచున్నారు. కావున మేము శాస్త్రక థా కథన పద్ధతి కేప్రాధాన్య మిచ్చి యున్నాము. అకారాది పద్ధతికి రెండవస్థాన మిచ్చియున్నాము" అని సెలవిచ్చియుండిరి. ఈ వాద మునందు గురుతరమైన సత్యము ఇమిడి యుండకపోలేదు. కాని ఎప్పటికైనను మనము దీనిని ఎదుర్కొనవలసి యేయుండును. కావున ఈ గ్రంథమునందు మేము పారిభాషిక పదములను సృష్టించుకొని వాటినే అకారాది క్రమములో కూర్చితిమి. ప్రయుక్తమైన శాస్త్రపదము వెంటనే ఆంగ్లపదమునుకూడ ఒకటి రెండుసార్లు వాడుటకు రచయితలను కోరియుంటిమి. అట్లు చేయుటవలన ఏవిషయము ఉపన్యస్తమగుచున్నదో సుబోధము కాగలదు. మా సంపాదక బృందమునందును పారిభాషిక పదప్రయోగము విషయమై ఏకవాక్యత సాధింపబడలేదు ఆధునిక రసాయన శాస్త్రమువంటి గహన వ్యా ప్తిగల శాస్త్రమునందు దేశీయ పదజాలమును ప్రయోగించుట కొంతవరకు మాత్రమే సాధ్యమనియు, లోతు లోతులకు దిగిన కొలదియు రచన సాగక వెనుకకు రావలసినవార మగుదుమనియు మా సంపాదకులు భావించుచున్నారు. అంతర్జాతీయ పదజాలమునే ఆశ్రయించుట కార్యకారియని వీరి తలంపు. ఇందును బలము లేకపోలేదు. రసాయన శాస్త్రమునందలి సంయోగ పదార్థములను గూర్చి చెప్పునప్పుడు సంస్కృతభాష కొంత ఉపయోగించును. కాని కేవలాంధ్రపదములు మరియు కార్యకారులుగ నుండుటలేదు. కావున కొన్ని శాస్త్రముల సందర్భమున అంతర్జాతీయ పదములను తప్పనిసరిగ వాడవలసిన ఆవశ్యక మేర్పడినది ఇచ్చట తెలుగుతనము బలియయిపోలేదా అని ఆ దేవకు అనవచ్చును. విషయ ప్రతిపాదనము సుల భార్థ బోధకత్వము మా లక్ష్యములు పిడివాదమునకు తావులేదు. ఆధునిక విజ్ఞాన సందర్భమున మన భాష చెందిన వ్యక్తా వ్యక్తపుష్టినిబట్టి రచన సాగించవలసిన వారమైతిమి. ఈ గ్రంథమునందు వాడబడిన అంతర్జాతీయ పదములు ఆంగ్లపదములు వాటికి కల్పింపబడిన పర్యాయపదములు తెలుపుటకై సాంకేతిక పదములు పట్టికనుకూడ చేర్పించినాము, భాషా విషయమున సులభ గ్రాంథికమునే తెలంగాణా రచయితలు అభిమానించినట్లు తోచినది. దీనిని శిష్ట వ్యావహారిక మునకు వీలయినంత దగ్గరగ ఉండునట్లు నిర్వహింపవలెనని మా సంపాదకీయ వర్గమువారు ఆదేశించిరి. ఇట్టి ప్రయత్నమే కొనసాగింపబడెను.

ఈ సంపుటమునందు 174 వ్యాసములు కలవు. వీటిలో అనువాదక వ్యాసములు 44 కలవు. రచయితలు 128 మంది, అనువాదకులు 19 మంది, "అ"కారమందలి వ్యాసములు 109. దీని పుటల పరిమితి 422. "ఆ" కారమందలి వ్యాసములు 65. వీటి పుటలపరిమితి 378. విషయ వర్ణనాత్మక పటము లసంఖ్య 228. ఇవిగాక, ప్రముఖ చిత్రములు కొన్ని రంగులలోను, ఆర్టు పేపరుమీదను ముద్రింపబడినవి. 174 వ్యాసములలోను 89 చరిత్ర – సంస్కృతులకు సంబంధించినవి, 73 విజ్ఞాన శాస్త్రాదులకు సంబంధించినవి, 12 ఇతరములు. మొత్తము మీద ఈ సంపుటములో ఆంధ్రులకు, ఆంధ్రభాషకు, ఆంధ్రదేశమునకు సంబంధించిన వ్యాసములసంఖ్య 55 . ఆంధ్ర సంబంధ వ్యాసముల పుటలనంఖ్య 328. . సంగ్రహ విజ్ఞానకోశము యొక్క ఆర్థికపు సమస్యలను కూడ ఊకొట్టుడు. ఈ యుద్యమమును ప్రజా మూలమని కదా మేము వాకొంటిమి. ఎట్లన మా సంపాదకులందరు గౌరవ కార్యకర్తలే. వారి విద్వత్కృషికై ధన్యవాదములను తప్ప సమితి ఎట్టి పారితోషికమును వారికిచ్చుటలేదు. వ్యాస రచయితలకు మాత్రము అచ్చు పుటకు రు. 5 వంతునను, అనువాదకులకు అచ్చువుటకు రు. 2-50 న. పై వంతునను పారితోషికము ఈయనగు చున్నది. దీనిని కూడ స్వీకరించని పెద్దలు కొందరు కలరు. ఈ గ్రంథము ఐదు సంపుటములని మొదట భావించి మొత్తము గ్రంథము వెల నూరు రూప్యములని మదింపబడెను, ప్రణాళికా రచనానంతరము ఇది ఆరు సంపుటముల గ్రంథమగునని చెల్లమాయెను. అయినను ఆరంభమునందే విరాళ రూపమున రు. 100 ఇచ్చు వారికి ఆరు సంపుటములును ఇయ్యవలెనని నిర్ణయించి ప్రకటనము జరిగెను. మొదటి సంపుటమునందు 'అ' నుండి 'కా' వరకు కల వ్యాసములు ప్రకటించుటకు ఉద్దేశించియుంటిమి. కాని వ్యాసములు నిర్దిష్ట పరిమితిని మించి సుదీర్ఘములుగ నుండుటచే "ఆ" వర్ణము పూర్తి కాకుండగనే సంపుటము ముగిసినది. ఈ యనుభవమును బట్టి విజ్ఞానకోశము