పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాగెను. మధ్యయుగములో విలియమ్ కాక్టస్టను అనునాతడు (క్రీ.శ.1481 ప్రాంతము) "ప్రపంచము అద్దము" అను గ్రంథమును కూర్చెను. క్రీ.శ. 1728 ప్రాంతమున చేంబర్సు అను పండితుడు మరియొక ఆ విజ్ఞానసర్వస్వమును సేకరించెను. ఇదియే ఫ్రెంచి విజ్ఞానకోశమునకు మార్గదర్శక మైనదని చెప్పుచున్నా ఇప్పుడు మనకు పరిచితమగు ఆంగ్ల విజ్ఞానసర్వస్వము 1788 లో ఆరంభింపబడి 1771 లో మొదటిమా ప్రకటింపబడెనట! మొదటి ముద్రణములో అందు మూడు సంపుటములు, 2670 పుటలు మాత్ర ముండెన ఇప్పుడు మనము చూచుచున్నది ఆంగ్ల విజ్ఞానసర్వస్వముయొక్క పదునాల్గవ ముద్రణము. సుదీర్ఘము పాండిత్య స్ఫోరకములు అగు వ్యాసముల రచనాపద్ధతికి స్వస్తిచెప్పి సర్వజన సుబోధకమైన సులభ సంగ్ర వ్యాసరచనా పద్ధతి ఈ పదునాల్గవ ముద్రణమునందు అవలంబింపబడెనని చెప్పుచున్నారు. అమెరికా సంయ రాష్ట్రములందును 1829 వ సంవత్సర ప్రాంతమునుండి విజ్ఞానసర్వస్వ ప్రకటనము సాగెను. వీని పరిణామ ఇప్పుడు మనము చూచు సుందరతరమును, వైశద్యగుణ భూషితమును అగు “ఎన్సైక్లోపీడియా అమెరికా అను గ్రంథరాజము. జర్మనీ దేశస్థులు విద్వత్తునందును పరిశ్రమ సహిష్ణుతయందును యూరపు ఖండము దగ్రేసరులు కదా ! సువిస్తృతములైన గొప్ప విజ్ఞానసర్వస్వములు మౌళికము లైనవి ఎన్నియో జర్మను భ యందు కలవని తెలియ వచ్చుచున్నది. ఇటలీ భాషయందును, స్పానిషు భాషయందును కూడ సమగ్ర విజ్ఞానక్ములు కలవట, రష్యన్ భాషయందు సోవియట్ ప్రభుత్వ ఆధ్వర్యవమున 32 సంపుటముల విజ్ఞాన సర్వస్వ ప్రకటితమైనది. - భారతదేశమునందలి ముఖ్యభాషలలో విజ్ఞాన సర్వస్వ ప్రచురణోద్యనుము సాగి కొన్ని భాషల విజయము సాధింపబడినట్లు తెలియుచున్నది. ముఖ్యముగ ఆంధ్రులకు సన్నిహిత భాషయైన మహారాష్ట్ర యందు పలురకముల విజ్ఞాన కోళములు వెలువడినవి. ప్రసిద్ధ మహారాష్ట్ర జ్ఞానకోశము కాక, వ్యాయా జ్ఞానకోశము, సులభ విశ్వకోశము, వ్యావహారిక జ్ఞానకోశము, చరిత్ర కోశము, స్థల నామకోళము, ములాఁ జ్ఞానకోశ్ (బాల విజ్ఞానకోశము) మున్నగునవి నిర్మింపబడినవి. మహారాష్ట్ర సోదరుల విజ్ఞాన ప్రీతికిని, కార్య కును ఇవి స్థిరోదాహరణములు. కన్నడ భాషయందు 'బాల ప్రపంచము' అను పేరుతో మూడు చిన్న సటముల సుందరమైన విజ్ఞానకోశము నిర్మింపబడినది.

సంగ్రహ విజ్ఞానకోశ నిర్మాణములో మమ్మెదుర్కొన్న మనిషురములను సోద రాంధ్రులకు నివేదిం పుట్టినింటి గుట్టు వెలిబుచ్చినట్లు కాకపోవచ్చును. ఆంధ్రభాషను ఆధ నవాహికగ చేయుటకు మనమె పురోగమింపవలసి యున్నదో ఉదాహరించుట మాత్రమే దీని ప్రయ్యెమే... (1) వద్యరచన పైగల మోజు, రచనపై మనవారియం దింకను పర్యాప్తముగా వ్యాప్తి కాలేదని ఆధునిక విజ్ఞాన విషయము గూర్చి వ్రాయవ లెనన్నచో బహుగ్రంథ పరిశీలనము చేసి సమన్వయము సాధించుకొనుటకు శ్రమించవలెను. తిక సోమయాజి వలె “తుదముట్టన్" శ్రమియించుట ఇంకను మనవారు సంపవలసియే యున్నది. (2) వైనిక విషయములపై వ్రాయవలెనను ఉత్సాహము గలవారికి ఆపాటవము చాలుట లేదు. ఈ తర వారును, 'వెనుకటి తరమువారును చాలవరకు ఆంగ్లము నందే వం వ్యాసంగము చేసిన వారు. ఆంధ్రమున భావప్రకటనము చేయుట కంతగా అలవడినవారు కారు. చేయవలెనని ఉత్సాహము కలిగి వీరు సంకోచించు చున్నారు. మైత్రీ నిర్బంధముచే వ్రాయవలన*డి.. చో ఆంగ్లభాషయందే వ్యాసములు పంపుచున్నారు. దీనినే గొప్ప సేవగ మేము భావించుచున్నాము. (3) ఆంగ్ల వ్యాసముల మూలమున అను కార్యక్రమము మేము మొదట ఊహించిన దానికన్న వివులతరమై కాలహరణమునకు మూలమైనది. అనువాది స్వతంత్రరచనవలె ప్రసన్న తావిభూషితమై యుండుట కష్టము, మరియు పారిభాషిక పదజాలము మన భాషయ స్థిరపడలేదు. స్థిరపరచుటకు జరిగిన సుస్థిర ప్రయత్నమును లేదు. ఇవి యన్నియు దీర్ఘకాలిక ప్రణాళిక మీద భూ ఓర్పువంటి ఓర్పుతో నిర్వహించవలసిన పనులు. తెలుగు భాషాసమితివారు 'అకారాదిక్రమమున గాక శాస్త్ర కథనపద్ధతిని అవలంబించుటకు హేతువును పద్మశ్రీ మోటూరి సత్యనారాయణగారు చక్కగా వివరించిరి.