పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/166

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్యామజాతక మును, పదవ గుహలో గోడలమీదను, స్తంభములపైనను గల ఇతర చిత్రములును వసారా స్తంభములమీది బుద్ధుని చిత్రములును శాసన లిపి నిదర్శ నమునుబట్టి కాని, సాంకేతిక పరిణామమునుబట్టి కాని శ. నాలుగవ శతాబ్దికి చెందినవిగా తలంపవచ్చును. ఈ కథ శ్రావణకుమార దశరధ శాప వృత్తాంతము లకు బౌద్ధులు కల్పించిన రూపాంతరము. గచ్చుబొమ్మలో సూచింపబడిన ముఖ్య సన్ని వేశములు పెక్కు వివరము లలో జాతకమున చెప్పబడిన వానితో సరిపోవుచున్నవి. సమగ్ర వేషధారులయిన పరిచారకు లై దుగురును, అల్ప వేషధారులయిన పరిచారకు లైదుగురును (వీరు బహుళః వాద్యములు వాయించువారును, వేట కాండ్రును కావచ్చును) శస్త్రాస్త్ర సన్నద్ధులై రాజు ననుసరించి యున్నారు. రాజు (అస్పష్ట చిత్రితమైన గుఱ్ఱమునుండి దిగి తాను జంతువని శంకించిన యొక అదృశ్యవస్తువు పై ధ్వనినిబట్టి, లక్ష్యముంచి, విల్లెక్కు పెట్టుచున్నాడు. ఆ వస్తు వాత డనుకొనినట్లుకాక పొదల వెనుకనున్న నదీ ప్రవాహములో కమండలువును ముంచుచున్న బ్రాహ్మణ కుమారుడగుట సంభవించినది. వనదేవత యెవ్వరో రాజును మందలింప యత్నించెను కాని లాభము లేక పోయెను. రాజు వశ్చాత్తప్తుడై శ్యాముని అంధ పితరు లను సేవింప ప్రతినపట్టును. వనదేవతా ప్రభావముచే శ్యాముడు రక్షింపబడును; అతని అంధ పితరులకు దృష్టి సంపద కలుగును ; రాజు శ్యామునినుండి " ధమ్మ ”బోధ ధమ్మ”బోధ గ్రహించును. జాతక కథలో కథన సౌందర్యముతోపాటు కొన్ని దృశ్యకావ్య లక్షణములుకూడ ఉన్నవి. చిత్ర కారుడు వానిని గచ్చుబొమ్మలో అత్యద్భుతముగా అనుకరించి నాడు. శ్యాము డమరుడా నాగుడా అని రా జెరుంగ కోరుట, శ్యాముని మన స్థైర్యము, అతని తల్లి దండ్రుల దీనాక్రందనములు, వేగముతో కూడిన వేడి చలనములు, అన్నిటికన్న మిన్నగా' జంతువులను మానవులతో కలుపు అనురాగ బంధములు మున్నగున విందుకు నిదర్శనములు. జలకమండలువును మోయుచున్న శ్యాముని చిత్రమున గ్రీకు శిల్పులు వేల్పుల విగ్రహములలో చూపిన లాలి త్యము కానవచ్చు చున్నది. అట్లే శ్యాముని తండ్రి తల 107 అజంతా నవవిజ్ఞాన యుగమునందలి (Renaissance) ఇటలీ దేశపు చిత్రములలో ముఖ్యముగా ఏసుక్రీస్తు చిత్రములలో కన వచ్చు కరుణమును సూచించును. లేడి చిత్రములు జంతు పరిశీలనమునకు చక్కని నిదర్శనములు. క్రీ. శ. 5వ శతాబ్ది యందలి చిత్రలేఖనములు: క్రీ.శ. 5 వ శతాబ్దిలో ఇతర కలాపములందువలె అజంతా యందలి చిత్రలేఖన కళలో కూడ అమితమైన ఉత్సా హము గోచరించుచున్నది. వానిలో పెక్కు 1, 2, 18, 17 వ గుహలలో ఇప్పటికిని నిల్చియున్నవి. ఈ గుహ లందు చిత్రితములును, శిలా ఖచితములును, అగు శాస నముల వలన ఇవన్నియు క్రీ.శ. 5వ శతాబ్దికి చెందినవని నిరూపింపవచ్చును. కళా సంకేతములనుబట్టి చూచినచో 17 వ గుహ - 1, 16 గుహలు సమకాలికములవలె తోచును. 17 వ గుహ వాని తరువాతను, రెండవగుహ అన్నిటికంటె చివరను వచ్చును. గుహల పౌర్వాపర్యమును నిర్ణయించు నప్పు డీ విషయ మిదివఱకే చెప్పబడినది. మొదటి గుహలో బుద్ధుని మహాభినిష్క్రమణ వృత్తాంత మునకును, 16 గుహలో అతని జనన బాల్యములకు సంబంధించిన కథలకును, సన్యాస జీవితమునకు సంబంధించిన ఇతర గాథలకును ప్రాధాన్య మొసంగబడినది. యందు బుద్ధుడు తొల్లింటి అవతారములలో ఉదారు డె న రాకుమారుడుగానో, గజము, వానరము, లేడి, బాతు, మత్స్యము, నాగము మున్నగు ఉత్తమమైన జంతువులుగనో వివిధ రూపములలో ఉద్భవించిన కథలు చిత్రింపబడినవి. రెండవ గుహలో బుద్ధుడు సిద్ధార్థుడుగా నున్నప్పటి కథలును, పూర్వజన్మలలో మతి మంతుడైన బ్రాహ్మణుడు, విధుర పండితుడు, శాంతి వాది, సన్యాసి మున్నగు రూపములను పొందిన కథలును వర్ణింపబడినవి. CHOTE - అలంకారిక రచనారీతులు :- వర్ణ చిత్రములందలి వస్తువు మువ్విధములుగా నుండును అలంకరణ విధానము, రూపకల్పనము, కథనము, అలంకార రచనా రీతులలో పశ్రావళులు (Scrolls) జంతువులయు, వృక్ష లతాపుష్ప మురియు బొమ్మలు ఇమిడి యున్నవి. ఇచ్చటి వైవిధ్య మనంతముగా ఉన్నదనియు, సూక్ష్మాతి సూక్ష్మ వివర ములు కూడ ప్రదర్సిరంపబడి ఉన్న వనియు, ఎచ్చటను