పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/156

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా నాట్యమాడుచు ఉన్నారు. వారిలో తహ్న, రతి, రంగ అను నాతని ముగ్గురు కుమార్తెలు వారి అనర్హు ఆరో భూషణములచే గుర్తింపదగియున్నారు. మారుడు తాను జైత్రయాత్రకై పోవుచున్నట్లు చూపబడినపుడును, తరు వాత శృంగభంగమునొంది బుద్ధునిచే పరాజయమును అంగీకరించుచున్నట్లు చూపబడినపుడును చక్కని యోధ వేషములో కనబడును. కాని మధ్యనున్న బుద్ధ విగ్ర హము శిల్పి యొక్క అభీష్టముననుసరించి మొత్తము దృశ్యముపై అధికార ముద్ర వహించుచున్నది. ఈ చిత్రము దానిలోని కథా సన్నివేశములనుబట్టి కథనాత్మక చిత్రముగా నుండవలసియుండును. ప్రకృతచిత్ర మట్లు గాక బుద్ధుని మాహాత్మ్యమును అలౌకిక ప్రభావమును మాత్రము ప్రదర్శించు చిత్రగుళికవలె నున్నది. అదే గుహలో తొలువబడిన బుద్ధ నిర్వాణ దృశ్యము మూర్తి నిర్మాణసూత్రములు కనుగుణముగనే చెక్కబడి, విషయ సంపత్తి అధికముగా నున్నను కథనాత్మకత యందు మిక్కిలి కొరవడియున్నది. ఇందు అనేకములగు ప్రతిమలును, నాటకీయ విశేషములును కలవు. బుద్ధ భగవానుడు శిరస్సును తలగడ పైనుంచి కన్నులు మూసి కొని శయ్యపై పరుండియున్నట్లు చూపబడెను. అతని కుడిచేయి గడ్డము క్రింద ఉంచబడినది. బుద్ధుని ప్రతిమలు తాళవృక్ష పరిమాణము (28 అ.ల 4 ఆం.ల పొడవు) లో నున్నను వాస్తవికతకు కొంచెమైనను భంగమురాకుండ చెక్కబడినవి. ఇట్టి స్వాభావికతయే దుస్తుల యొక్కయు, తలగడల యొక్కయు ముడుతలలో కూడ కానన గును. ఆతని ముఖము గాఢనిద్రలో నున్నట్లు నిశ్చలత్వమును, ప్రశాంతతను వెలిబుచ్చుచున్నది. శయ్య యొక్క కోళ్ల మీది శిల్పపు తీరులలో నిప్పటికి పదునాలుగు, పదు నేను వందల సంవత్సరములు గడచినను ఎక్కువ మార్పులు రాలేదు. అట్టి మాదిరి చెక్కడపు కోళ్లుగల మంచములు నేటికిని భారతదేశపు నగరములందు కానవచ్చును. నీటి కూజా నుంచుట కేర్పరుపబడిన ముక్కాలి పీట కూడ ఒక మనోహర శిల్పముగల గృహోపకరణము. ఆ శయ్య-ప్రక్కన సుమారు ఇరువది మంది భిడుకుల యొక్కయు, భీముణుల యొక్కయు విగ్రహములు, తమ గురుదేవుని నిర్వాణమునకై పరితపించుచున్నట్టి 101 భావమును స్పష్టముగా ముఖములమీద వ్యక్తము చేయు చున్నవి. శయ్య పైని గుహాకుడ్యముమీద ఎత్తుగా ఇంద్రాది దేవతలు, దేవదూతలు, గంధర్వులు, ఈ మహామహుని (బుద్ధుని) యొక్క స్వర్గ పునరాగమనమును ఆహ్వా నించుటకై క్రిందికి దిగి వచ్చుచున్నట్లు చూపబడినది. శయ్య ప్రక్క నున్న ప్రతిమలందు (మొదట) చూపబడిన విషాదముతో పోల్చిచూచినచో తరువాత దృశ్యభాగ ములో సమ్మోద భావము గోచరించును. ఈ శిల్పము మొత్తముపై కలుగుభావము సామూహికతయందు కన్న కరుణరసాత్మకతయందు పరాకాష్ఠ నందుకొన్నది. ఈ దృశ్యమునందలి శోకచ్ఛాయయే నేత్రములను, మన స్సును అధికముగా ఆకర్షించును. గుహాలయములలోని బ్రహ్మాండమగు బుద్ధ విగ్రహ ములు చైత్యముల సమున్నత ముఖభాగములు భావ గాంభీర్యమును, ఆదర్శమహత్త్వమును చాటుచున్నవి. సారనాధయందలి శిల్పములందుకూడ, అవి యెంత మనో రంజకముగను, రమణీయముగను ఉన్నను ఇట్టి విశేష స్ఫూర్తి కలుగదు. ఇట్టి పరిణామము అనివార్యమై తోచును. ఏలయన, ఇతర విగ్రహములు బుద్ధుని జీవిత ముతో సంబంధించిన వై నను పరిమాణము నందు ను, పాముఖ్యమునందును హ్రస్వీకృతములై యున్నవి. బుద్ధ భగవానుని విగ్రహమునకు ప్రత్యేక సమున్నత స్థాన మొసంగబడజొచ్చెను. ప్రాచీన బౌద్ధులు బుద్ధుని యొక్క విగ్రహ కల్పనమును నిషేధించియుండగా, తరువాతిదిగు అజంతా శిల్పము అట్టి నియమములను విసర్జించి, ఆతని విగ్రహములను అసంఖ్యాకముగా అనేక ఆకృతులలో తొలుచుటయందు స్వేచ్ఛను వహించెను. బుద్ధ ప్రతిమలు విహారములందును. చైత్యములందును మాత్రమే గాక ద్వారమంటపముల మీదను, గోడ గూళ్లలోను, చూరుల మీదను అలంకరణ వస్తువుగా తొలువబడి యున్నవి. బుద్ధ విగ్రహములు :- బుద్ధమూర్తుల శిల్పకళా ప్రాశస్త్య లు: మును నిరూపించుటకు ఈ ఒక్క ఉదాహరణము చెప్ప వచ్చును. మొదటి గుహలోని పూజామందిర మందలి బుద్ధవిగ్రహము ధర్మచక్ర ముద్రతో ధర్మోపదేశము చేయుచున్నట్టి వైఖరిలో అట్టి ప్రతిమలకు ఒరవడి శిల్ప ముగా నున్నది. అతడు సింహాసనముమీద పాదతలములు