పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/151

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా

వెనుకకు త్రిప్పియున్నట్లును అచ్చవులేళ్ళవలె కనుపించును. ఈ నాలుగు బొమ్మలలోని లేళ్ల శరీరములును ఘనాకారమునకు తగిన వాకృతులలో మలువబడెను. సరియగు కొలతలతో సజీ

అజంతాలో మానవాకృతులు సంఖ్యాధిక్యతలోను భంగిమలలోను ఆశ్చర్యకరముగా చెక్కబడెను. వీనిని మనము నాగరాజుగను, నాగినిగను, గంధర్వునిగను, యమునిగను, హారీతి లేక పంచిక గను, ద్వారపాలుడు లేక ద్వార పాలిక గను, అప్పుడప్పుడు భగవత్ర్పార్థనలు సలుపు భ క్తునిరూపములోను చూడగలము. ఒకే ఒకచోట చేతియందు బెత్తముకలిగి, కొంతమంది బడిపిల్లలతో ఒక బడిపంతులు కానవచ్చును. ఆ పిల్లలలో కొందరు పాఠము అందు నిమగ్నులై యుందురు. మరికొందరు పొట్టేళ్ళ పందెమును చూచి వినోదముగా ముచ్చటించుకొనుచుం దురు. ఎచ్చటను మానవుని యొక్క ఆంతరంగిక గాంధీ ర్యమును, ఠీవిని వెలిబుచ్చుటలో శిల్పి యే విధముగను పొరపడలేదు.

అసంఖ్యాకములగు నాగరాజ ప్రతిమలలో రెండు, కళాదృష్టితో సర్వోత్కృష్టమగు ప్రాశస్త్యమును కలిగి పేర్కొనదగియున్నవి. 19వ గుహ యొక్క యెడమ వైపు చిట్టచివర తొలువబడిన ఫలకమందు నాగరాజు, నాగినియు ఒక సింహాసనము మీద కూర్చుండియున్నట్లు చూపబడెను. మరొక నాగిని తన కుడిచేతియం దొక చామరముతో సింహాసనము ప్రక్కన పరిచారిక వలె చూపబడెను. ఈ ఇద్దరు నాగస్త్రీల భంగిమములలో ఎంతో వినాళము సంభవించినను అమూడు విగ్రహముల ముఖ పై ఖరులలోని ఆంతరంగిక ప్రశాంతతను బట్టి, బౌద్ధ శిల్ప ములో ఆధ్యాత్మిక ప్రభావ ప్రకటనమునకు ఎట్టి ప్రముఖ స్థానము కలదో వెల్లడియగుచున్నది.

ఇద్దరు నాగరాజులు 23 వ గుహా ద్వారమున కిరు వైపుల ద్వారపాలకులుగా తొలువబడిన మరొక ఉదా హరణము కలదు. ఆ బొమ్మలు ఎక్కువ పెద్దవిగా లేవు. కాని వాటి శిరస్సుల ఆకార నిర్మాణము శిల్పి యొక్క పనితనములోని ఉత్కృష్టతను వెలిబుచ్చుచున్నది. యాకృతులు సుకుమారములు. ముఖవైఖరులు గాంభీ ర్యమును, మనః ప్రశాంతతను స్ఫురింపజేయును.

కథనాత్మక శిల్పము శిల్పమందు గాథల కూర్పు అనగా బుద్ధుని కథలను లేక జాతకములను (పూర్వ జన్మలు) లేక జీవిత విశేషములను తెలుపు శిల్పము అజంతా యందు చాలవరకు లేదనవచ్చును. కాని వర్ణ చిత్రలేఖనము ఇట్టి యితివృత్తమును గూర్చి యే ప్రవర్తించినది. ఉబ్బెత్తు శిల్పమునకు అమరావతి, నాగార్జున కొండ, సాంచి, థార్హూత్ వంటి స్థలములందు చూపబడిన అత్యంత శ్రద్ధ అజంతాలో చాలమట్టుకు సన్నగిలినది. ఇది వాస్తువునకు అంగమై, సహాయక కృత్యములను పూర్తి చేయుచు అప్రధాన మైయున్నది.

ఐనప్పటికిని మొదటి గుహ యొక్క వీథినదరు (Facade) మీది నాలుగు దృశ్యములను దెల్పు నాలుగు రంగము లును, 26 వ గుహలోని ప్రలోభన దృశ్యము, మహా వీరి నిర్యాణ దృశ్యము మొదలగునవి అజంతాలో ఉబ్బెత్తు చిత్ర శిల్ప సంప్రదాయ మింకను నశింపలే దనియు, అమరావతి మున్నగు ప్రాచీన స్థలములందు ఈ రీతి శిల్పమున విశ్వకర్మలు సాధించిన పరినిష్ఠి తత్వమును శిల్పి కోల్పోవలేదనియు, కధనాత్మక శిల్ప విన్యాసము ప రాకాష్ఠను పొందినదనియు ఈ దృశ్యములు వ్యక్తము చేయుచున్నవి. విపత్కరమైన నాలుగు దృశ్య ములు అనగా గౌతముడు తన విహార సమయములందు చూచినట్టియు, చివరకు అతని సన్యాస నిర్ణయము నకు కారణమైనట్టి దృశ్యములు - వ్యాధిగ్రస్తుడు, వృద్ధుడు శవము, (నాలుగవది శిథిలము) - అమరావతీ శిల్పి యెక్క అశేష నై పుణ్యముతో చెక్కబడెను.

ప్రలోభన దృశ్యము (మొదటి గుహ) జనరంజక మును, ఆనాటి కళావేత్త యొక్క అభిమాన విషయ మును అయియున్నది. అజంతాలోని అత్యుత్తమ వర్ణ చిత్రములలో నొకటి దానికై వినియోగింపబడెను. కాని 28 వ గుహలోని శిల్పము "బహుళం, ఈ రెంటిలో, దృశ్య ప్రకటనలో అత్యుత్తమమైనది." బుద్ధునికి ఎడమ వైపున మారుడు చేతిలో ధనుర్బాణములతో నిలచి యుండును; మారుని ముందు ఒక గొడుగు లాంఛనము గనో లేక బుద్ధుని దివ్యశక్తి నుండి తన రక్షణ కగు చిహ్నముగనో పట్టియుంచబడెను. మారుని మారుని ముందు భాగమున కొందరు స్త్రీలు ఆసీనులై, మరికొందరు