పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/135

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా

లికమయి, రెండవ శతాబ్దికి చెందిన కొండనే, కార్లే వద్దను గల శిల్ప విన్యాసమునకును, వస్త్రధారణము నందును ఆభరణములు, నైతిక లక్షణములు మానవ విగ్రహము లందు ప్రదర్శించుటయందు సన్నిహితమయిన సామ్యము కలదు.

తొమ్మిదవ గుహ కూడా ఒకచైత్యశాలయై యున్నది. దానికిని పదవ గుహకును నిర్మాణ రచనా విషయమున పోలిక కలదు. ఈ రెండును దాదాపుగ సమకాలిక ములు. తొమ్మిదవ గుహ 10 వ గుహకంటే కొంచెము పూర్వ కాని కొందరు వాదించుచున్నారు. కొంద రది 10వ గుహకంటె కొంచెము అనంతర కాలికమని వాదించు చున్నారు. 12 వ గుహ ఒక విహారము, అందు కుడి మూలనున్న ఒక కొట్టునకు ఎడమవైపున వెనుకనున్న గోడపై ఒక శాసనము కలదు. అందు దీనిని (గుహను) ఘనమడదుడను వణిజుడు కట్టించి యిచ్చెనని వ్రాయబడి యున్నది. ఈ శాసనము 10 వ గుహయందలి వాశిష్ఠీ పుత్తకటహాది శాసనలిఖితముకంటె అనంతర కాలిక మనుట స్పష్టము.

18 వ గుహ ఒక చిన్న విహారము. దీని ముఖభాగము పడిపోయినది.12వ గుహయందువలె ఇందొక స్తంభరహిత శాల (Astylar) కలదు. అందు మూడు ప్రక్కలందు కొట్టి డీలు ఉన్నవి. ఒక్కొక్క కొట్టిడీలో రెండేసి రాతి నెజ్జలు కలవు. ఒక కొట్టిడీలో ఎత్తైన రాతి దిండ్లుగూడ నున్నవి. ఎనిమిదవ గుహాలయముకూడ ఒక విహారము. అది అత్యం తము నిమ్నతలముననున్నది. ఆ గుహాలయము విశేష ముగా నాశనము కావింపబడియున్నది. అందలి తలము విద్యుద్దీపములను సమకూర్చు విద్యుదుత్పాదక యంత్ర ములను స్థాపించుటకు అనుకూల ప్రదేశముగా ఉపయోగ పడుచున్నది.

8, 9, 10, 12, 13 సంఖ్యలు కల అయిదు గుహలు క్రీస్తుశకముకంటే పూర్వకాలమునకు చెందినవిగా కనిపిం చుచున్నవి.

ఇయ్యాద్య గుహాఖనన కార్య సంరంభానంతరము వాకాటక రాజుల ఆధిపత్యకాలము వచ్చువరకు ఈ సృజ నాత్మక కార్యమునందు ఒక విధమగు స్తబ్ధత యేర్పడి నట్లు కనిపించును. వాకాటక రాజుల రాకతో శిలాఖననము అత్యధికముగా భారీయెత్తున ఆరంభింపబడెను. వాకాటక రాజులును, ఉత్తర హిందూస్థానమునందు సామ్రాజ్యాధిపత్యమును వహించిన గుప్తరాజులును సమ కాలికులై యున్నారు. ఈ రెండు రాజకుటుంబములును వై వాహిక సంబంధమును కలిగియుండెను. పూర్వమందు నిర్మింపబడిన గుహాలయములయొక్క ఆదర్శము, వాటి యందలి చిత్రలేఖన సంపద కారణములుగానో - కళాత్మకమును, సృజనాత్మకమునగు నీ కార్యమునందు గుప్త చక్రవర్తులను మించవలెనను సమంచిత స్పర్థాభావమే కారణముగానో ఈ పునరుజ్జీవన విషయకమయిన ప్రచోదక శక్తి ఎద్ధియైననుసరే ఈ కాలమునందు మనకు రమణీయములయిన గుహాలయములు లభించినవి. ఇవి ఈకాలమున ప్రవర్తిల్లిన వాస్తు విద్య, మూర్తి నిర్మాణము, చిత్రలేఖనము మున్నగువాటికి అత్యుత్తమ నిదర్శనములు. వీటిలో పెక్కింటి ఉత్పత్త్యభివృద్ధులకు కారణము ఉద్యోగుల' యొక్కయు, వత్స గుల్మము నందలి (నేటి బేసిమ్, అకోలా జిల్లా, బెరారు) వాకాటక రాజుల సామంతుల యొక్కయు, ఔదార్యమే. వాకాటక రాజగు హరిసేనుని (క్రీ. శ. 475-500) మంత్రి వరాహదేవుడు, 16 వ గుహాలయమును బౌద్ధ సంఘము నకు సమర్పించెను. 17వ గుహాలయమును హరిసేనుని సామంతుడు అశ్మకుడను రాజకుమారుడు దాన మొన ర్చెను.

1, 2, 16, 17 సంఖ్యలుకల గుహాలయముల కాలానుక్రమమును గూర్చి విమర్శించినచో, 1, 18 సంఖ్యలుకల గుహాలయములు సమకాలికము లనియు, 17 వ గుహ, వాటికి అత్యంత సన్నిహితోత్తర కాలిక మనియు, 2 వ గుహ ఆ గుహాలయ శ్రేణిలో తుట్ట తుదకు నిర్మితమయినదనియు, విద్వాంసు అందరును అంగీకరించిన విషయమే. కాబట్టి ఈ నాలుగు గుహాలయ ములును క్రీ. శ. 5 వ శతాబ్దికి చెందినవనియు, క్రీ. శ. 5వ శతాబ్ది మధ్యభాగమున నిర్మాణ కార్యశక్తికి సంబంధించి నట్టియు, అత్యంతోగ్రమును, ఫలప్రదమునగు కాలము ఘటిల్లిన దనియు తేటపడుచున్నది.

26 వ గుహ కొంచెము అనంతర కాలమునకుచెందినది. కుడివైపు దర్వాజా పైభాగమున వరండాకు వెనుకనున్న