పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/118

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాదమున నైతికముగా లేదా ఆధ్యాత్మికముగా అభి వృద్ధికి అవకాశ మేలేదు. ఇది మరల వ్యక్తిత్వ నిరసనమునకు మార్గదర్శక మగును. అనంత వస్తువికాసము నశ్య వస్తువును కల్పిం చుచో ; 'సర్వము దేవుడే' అను అఖిలేశ్వర వాదమును బట్టి, నశ్యవస్తువు అనంతవస్తువునకు సమాన మయినచో ; ఈ రెండింటికిని భేదము శూన్య మగును. ఆత్మ, దేవుని ప్రతిచ్ఛాయాంక మగుటచే, పరిచ్ఛిన్నాత్మలకు విశ్వాత్మ గుణాధిరోహణము సాధ్యమా అను విషయమున ఔదా సీన్య మేర్పడును. భావ మేమన- శాస్త్రీయముగా మాత్రము ఆత్మ విశ్వాత్మతో స్వీయమైన వ్యక్తిత్వమును కోల్పోవు నంతగా లీనమగును. పూర్వోక్తము లయిన కారణములను పుర్కరించుకొని ఈశ్వర వాదులు అన్యుల తోపాటు అఖిలేశ్వర వాదమొక వేవాంతమనియు అది తృప్తికరమగు మతస్థాయిని అందుకొనజాలక పోయిన దనియు భావించుచున్నారు. శ్రీ శ్రీ దేవి అగ్గిపుల్లలు :- నిప్పును తయారుచేసికొనుట మాన వుడు తన నిత్యజీవితమందు ఎదుర్కొసిన తొలి సమస్య. ఎండుకఱ్ఱల రాపిడిచే అగ్నిని రగుల్కొల్పు పురాతన విధానము నేటికిని భారతదేశ గ్రామములలో గాన వచ్చుచున్నది. రాతి యుగములోను, కంచు యుగము లోను రెండు రాళ్ళను ఇందుకొరకై ఉపయోగించెడి వారు. వీనిలో నొకటి పై రైట్సు రూపమున ఇను మును కలిగియుండును. క్రమేణ. ఈ పద్ధతి ఉక్కు చెకు ముకిరాయి నుపయోగించు టెండరు బాక్సు (Tinder Box) విధానముగా మార్పుచెందెను. "టిండర్ ” పెట్టె నుండి వెలువడు నిప్పు రవ్వలను దూది పై గాని, మాడిన నారపై గాని, గంధకపు పూతగల్గిన పుల్లలపై గాని పట్టి, నిప్పు తయారుచేసెడివారు. రసాయనిక పదార్థముల సహాయముచే, తయారుచేయబడు అగ్గిపుల్లలకిది నాంది అని చెప్పవచ్చును. 1878 లో హాంబర్గు' నివాసియగు 'బ్రాండు' అను శాస్త్రజ్ఞుడు భాస్వరమును కనుగొనినప్పటి నుండియు, దాని నుపయోగించి కృత్రిమముగా నిప్పు తయారు చేయుటకై చేయబడిన ప్రయత్నములన్నియు వ్యర్థ 79 అగ్గిపుర్లలు ఈ మాయెను. ఈలోగా 'బెర్డెలాట్' అను శాస్త్రజ్ఞుడు, దహ్యపదార్థములను గాఢామ్లముల సమక్షమున హరిత ములతో ఆమ్లజనీకరణము చేయుట కనుగొనెను. పద్ధతి హరిదాన్లుపు అగ్గిపుల్లలను (Eximuriated Matches) తయారుచేయుటకు దారితీసెను. దీని ప్రకారము గంధ కము, పొటాషియ హరితము, చక్కెర, బంక, రంగు పదార్థములు కలిపి తయారుచేసిన ముద్దను సన్నని పుల్లల కొనలకు పట్టించి, ఆ కొనలను గాఢగంధకి కామ్లములో ముంచినచో పుల్లలు మండెడివి. కాని ఎల్లప్పుడును గాఢ గంధకి కామ్లము నొక సీసాలో తీసికొనిపోవలసి వచ్చు టచే, ఈ పద్ధతి చాల అసౌకర్యమనిపించెను. 1809 లో 'పారిస్' నగరవాసియైన 'డెరిపాస్' నకు, భాస్వరము నుపయోగించి కృత్రిమముగా నిప్పును కల్పించు విధా నమునకై పేటెంటు (Patent) ఈయబడెను. 1827 వ సంవత్సరములో 'రాపిడి అగ్గిపుల్లల' ను ఇంగ్లాండు దేశీయుడగు జాన్ వాకరు మొదటిసారి జయ ప్రదముగా తయారుచేసెను. ఈ పుల్లల కొనలు అంటి మొనిగంధకిదము, పొటాషియ హరితము, తుమ్మబంక కల్గినముద్దచే పూయబడినవి. ఈ కొనలను గాజుపొడుము కలిగిన గరుకు కాగితముపై కాగితముపై రాచినప్పుడు మంట కలుగును. భాస్వరము నుపయోగించి తృప్తికరమైన రాపిడి అగ్గిపుల్లలను 1881 లో తొలిసారిగా ఫ్రాన్సు దేశీయు డైన 'ఛార్లస్ సౌరియా' అను నతడు తయారు చేసెను. అతడు పొటాషియం హరితమును ఆమ్లజనీకరణ సాధన ముగా నుపమోగించుటచే, మందులోనికి కావలసిన పచ్చభాస్వరము నూటికి 50% నుండి 5% వరకు తగ్గి పోయెను. కాని ఇంతవరకు భాస్వరము నుపయోగించి చేయబడిన అగ్గిపుల్ల లన్నింటిలోను, పచ్చభాస్వరము వాడుటచే కార్మికులకు 'ఫాసీజా' (Phossy jaw) అను ప్రమాదమైన దౌడజాడ్యము సంభవించు చుండెను. 1864 లో 'లెమాయిన్' కనుగొనిన 'ఖాస్వరత్రిగంధ కిదము' ను పచ్చభాస్వరము (Sesanisulphide of Phos- phorus) నకు బదులుగా నుపయోగించి, ఫ్రాన్సు దేశ ములో నెవీన్ మరియు 'కహన్' అను వారలు 1898 లో మొదటిసారి, అగ్గిపుల్లలు మందును తయారు