పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములు, పర్యాయ పదములు మాత్రము కూర్పబడును. ఉదాహరణమునకు వాయువు అనగా గాలి యను అర్థ మీయబడును. నిఘంటువుపని ఇంతటితో ముగిసినది. విజ్ఞానకోశము యొక్క పని ఇక్కడనుండి యారంభించును. వాయువు లేక గాలి అను పదార్థమెట్టిది? దాని స్వరూపమేమి? అది ఘనపదార్థమా? ద్రవపదార్థమా? మరొక పదార్థమా? అది ఏక పదార్థమా? లేక ద్రవ్యాంతర సంయోగముచే నేర్పడినదా ? దాని గుణము లెవ్వి? శబ్ద గుణకత్వము, గంధవాహిత్వము. దీనిని ద్రవ్యాంతరముగా మార్చనునా ? దీనిని సర్వనాశము చేయవచ్చునా? ద్రవ్యాంతరరూప స్వీకృతిని మాత్రము పొందింపగలమా ? ఇత్యాది అసంఖ్యాక ప్రశ్నములకు విజ్ఞాన కోశమే సమాధానమీయగలదు. ఈ ప్రమేయమున నిఘంటువు మూకీ భావము వహించుచున్నది.

ప్రజల జీవితమును సుఖవంతముగను ఆనందతుందిలముగను చేయుటకు, వారికి జ్ఞానచక్ర పరిచయము కావించుట అవసరమని తేలుచున్నది. ఎట్టి విజ్ఞానమును మన ప్రజలకందించవలెను ? పూర్వ విజ్ఞానమా? ఆధునిక విజ్ఞానమా? పూర్వ విజ్ఞానము విస్తారముగా తర్కమూలము, దార్శనికము అని భావింపవలసి యున్నది. అణిమాది సిద్ధులు కలవనియు, పూర్వ మహర్షుల కవి కరతలామలకములై యుండెననియు, పురాణములలో చదువుదుము.కళాపూర్ణోదయము లోని మణిస్తంభు డను సిద్ధుడు దూరశ్రవణము, దూరదర్శనము, కామ గమనము మొదలగు అపూర్వ శక్తులను సాధించే నని కవి వర్ణించెను. వీటిలో మొదటిశక్తి ఇప్పటి 'టెలివిపన్' వంటి దనుకొందము. ఈ శక్తుల నాత డెట్లు సాధించెను? తపస్సుచే సాధించె నని సులభముగ సమాధానము చెప్పుదురు. ఈ సమాధానముచే ఆధునిక దృష్టికి, హేతువాదరత బుద్ధికి, సంతృప్తి కలుగుట లేదు. మీకు ఆస్తికబుద్ధి లోపించుట వలన తపోమహ త్త్వమును నమ్మలేకున్నారు, మీరు హతాళులు, అని పెద్దలు గదమాయింతురు. ఎట్లయినను ఫలితము శూన్యము. పోనిండు. కృచ్ఛ చాంద్రాయణాదుల చేతను, పవన పర్ణాంబు భక్షణముచేతను కొన్ని సిద్ధులను సాధించగలమే యనుకొండు. ఆ శక్తులు సాధకులకు మాత్రమే పరిమితములై యుండును. కాని ఇతరులకు సంక్రమింపచేయుటకు వీలు కానివి. పూర్ణోదయ సిద్ధుడు దూరమునుండియే మణికంధరుని నైతిక పతనము మున్నగునవి వీక్షించి నవ్వుకొనగల్గెను కాని, తహతహ పడుచున్న కలభాషిణికి ఆ దృశ్యములను చతుర్గోచరము చేయించగలిగెనా? లేదు. నేటి కాలమందన్ననో, ప్రపంచపు మారుమూలలలో దృశ్యములను, శబ్దములను ఎప్పటికప్పుడు నిరుపేదకూడ చూచి, వినగలుగు చున్నాడు. పూర్వ విజ్ఞానమునకును, ఆధునిక విజ్ఞానమునకును భేదము సుస్పష్టమగుటలేదా? భారతీయ ప్రాచీన విజ్ఞానమును మనము అవిశ్వాసముతో చూడనక్కరలేదు. పరిహసించుట మరియు అవివేకము. కాని దాని సంబంధమైన పరంపరాజ్ఞానము, ప్రయోగ కౌశల్యము, ఆనుభవ సుఖము దూరదూరగతములై పోయినవి. నోటిలో లేని పటిక బెల్లమును చప్పరించి మాత్రము లాభమేమి ? మహత్త్వపూర్ణమై యుండునని విశ్వసించుచు, ఒక నమస్కారముచేసి మనదారి మనము చూచుకొనవలసి యున్నది, దానిని పునః ప్రతిష్ఠింపగోరుట కుందేటి కొమ్ము సాధించుటకై తిరుగుట వంటిదే యగునేమో?

ఇక మిగిలినది ఆధునిక విజ్ఞానము. ఇది యంతయు తెల్లవాని మాయ అన్నను ఇది మనలను వదలుట లేదు. దీని సంబంధమైన పరంపరాజ్ఞానము, ప్రయోగ కౌశల్యము, అనుభవ సుఖము మనకు ప్రత్యక్ష ప్రతీతిలో ఉన్నవి. దీనిని కాదనుట యెట్లు ? ఉపాసింపకుండుట యెట్లు ? కావున ఆధునిక విజ్ఞానమే సర్వదా ప్రతిపాద్య మగుచున్నది. పూర్వ విజ్ఞానము విశ్వాసముపై నాధారపడి యున్నది. ఆధునిక విజ్ఞానము ప్రయోగమూలమై యున్నది, ప్రయోగసాధనములు, కౌశలము అలవడినచో ఎల్లవారును దీనిని పరీక్షింపవచ్చును. హేతువాదము, సంభావ్యత దీనికి పునాది రాళ్లు. పూర్వయుగము విశ్వాసయుగము. ప్రస్తుత యుగము వివేచనా యుగము. వివేచనకు ప్రయోగము మూలము. కావున విజ్ఞానసర్వస్వములో కళాశాస్త్రములతోపాటు విజ్ఞానశాస్త్రములు కూడ ప్రాధాన్యము వహింపదగి యున్నవి.

నిద్రాణమైన జాతీయందు నవచైతన్యమును శూత్న జీవితమును ప్రబోధించుటలో విజ్ఞానకోశమే అనితర సాధనమని ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వచరిత్ర వలన తెలియుచున్నది. రూసో, వాల్టేరు, డిడిలో మున్నగు ఫ్రెంచి మహాతాత్త్వికుల - విప్లవవాదుల – రచనలచే జ్వలితాంగారకుండ సన్నిభమైనది ఫ్రెంచి ఎన్ సైక్లోపీడియా,