పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నివేదన వాక్యములు

భారతీ శుభ గభస్తి చయంబుల తేజరిల్లు నో ఆంధ్ర మహాజనులారా:

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రథమ సంపుటమును తమ కరకిసలయ రంజితముగ సమర్పించుచు సమితి పక్షమున మేముచేయు నివేదినమును ఆలింపుడు. మేము తెచ్చిన ఉలుపాను సాదరముగ స్పృశించి సావధానము వెంట, సానుభూతితో పరికింపుడు. కానుకలు రెండు విధములు. కానుకను స్వీకరించు వ్యక్తి మహత్త్వమున కది అనురూపముగ ఉండవలెను. లేదా సమర్పించువాని సామర్థ్యమును బట్టియు అది వలయితము కావచ్చును. శ్రీకృష్ణునకు కుచేలుడు అటుకులు మాత్రమే మూటగట్టి తేగలిగినాడు. మనసు చలువయే ప్రధానము కాని వస్తువు విలువ కాదుగదా !

"కానుక యే సమర్పింప దలచినచో సృజనాత్మకమైన పద్య కావ్యమో, గద్య కావ్యమో, నవలయో, నాటకమో, ప్రహసనమో, ఏకాంకికయో, కథానికయో, గల్పికయో, స్కెచ్చియో, ఏదేనొక యపూర్వ కథానిబంధనముగ వ్రాసికొని రాలేదేమి ? నీరసమై వ్యుత్పత్తిమాత్ర పర్యవసాయియై, చాలవరకు సంకలనాత్మకమైన ఈ ప్రయత్నమేమి ? దీని ప్రయోజనమేమి?" అని మీరు పెదవి విరువబోకుడు, ప్రతి భాషయందును సృజనాత్మక సాహిత్యమును, ప్రయోజనాత్మక సాహిత్యమును రెండును ప్రాణాధారములే. జీవితపు పరమ ప్రయోజనమైన నిస్స్వార్థానందమును సమకూర్చునది సృజనాత్మక మైన సాహిత్యము. అది ఆధేయము. ఆధారము లేక అధేయము నిలుచుట యరుదు. నిస్స్వారానందమునకు ఆధారమేమి? సుసమృద్ధమై, సుసంపృష్టమైన జీవితము, మానుషానందమును నిరూపించుచు ఉపనిషన్మహరు లేమనుచున్నారు ? “యువా స్యాత్సాధు యువాధ్యాయ ః । ఆశిష్ట్లా ద్రడిష్ఠా బలిష్ఠః | తస్యేయం వృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్ సవీకో మానుష ఆనందః" మానుషానందమునకు మానదండ మెవడు? రూపసియైన యువకుడు, అధ్యయనపరుడు, కార్యములందు చురుకైనవాడు, మనోదార్థ్యముగలవాడు, బలిష్ఠుడు అయిన ఎవని కొరకు ఈ భూమి అంతయు విత్తపూర్ణమై యుండునో అట్టి యువజనుడు మానుషానందమునకు గజము బద్ద. ఏవం విధమైన ఆనందమునకు ఆధేయముగా ఒక వ్యక్తినిగాని, ఒక జాతిని కాని చేయు సాహిత్యమేది? ప్రయోజనాత్మక సాహిత్యమే అని మనవిచేయ సాహనించుచున్నాము. సృజనాత్మకమైన నాకృతియందు దీనినిగూడ నేను వ్యంగ్య మర్యాదగా సాధించుచునే యున్నానుగదా, అని యొక కవికుమారుడు సవాలు చేయవచ్చును. నాయనా! నిజమే. అంతవరకును సాహిత్యము యొక్క ప్రయోజనాత్మక ఆవశ్యకమును నీవు గుర్తించుచున్నావుగదా! సుకుమార బుద్ధులకు కావ్యము, జనసామాన్యమునకు అది చాలదు. వారికి విశదముగను, సుస్పష్టముగను, అసందిగ్ధముగను తెలియచెప్ప వలెను.ప్రయోజనాత్మక సాహిత్యమే ఇచ్చట మనకు ఆశ్రయణీయము, కవులకును మాకును గతిభేదమే కాని గమ్య భేదము లేదు.

ప్రయోజనాత్మక సాహిత్యమునందు "విజ్ఞాన సర్వస్వము" మూర్ధన్యమైనది. ఆంగ్లమునందు Encyclopaedia అను పదముచే నిది చెప్పబడుచున్నది. Enkyklios (చక్రరూపమైన) paideia (విద్య) అను గ్రీకుభాషాపదముల కూడికచే నిది యేర్పడినదని తెలియవచ్చుచున్నది. అనగా విద్యాచక్రము లేక జ్ఞాన చక్రము అని దీని యర్థము, కళాశాస్త్రములు, విజ్ఞానశాస్త్రములు - వీటి ఆవృత్తియే విజ్ఞానవలయము. దీనికే మనవారు విజ్ఞాన సర్వస్వమని చక్కగా పేరిడినారు. దీనినే కొందరు 'కోళ' శబ్దాంతముగా పఠించుచున్నారు. మహారాష్ట్రభాష యందలి ఈతెగ గ్రంథము 'జ్ఞానకోశము' అని వ్యవహరింపబడినది. విజ్ఞాన సర్వస్వమును ఒక విధముగా కోశమే. నిఘంటు రూపములో నుండుట చే కూడ దీనికి పేరు వచ్చియుండవచ్చును. నిఘంటువునందు పదములు వాచ్యార్థ