పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/74

ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

స్వగ్రామం షాజహాన్‌పూర్‌లో అష్పాఖుల్లా ఖాన్‌ సమాధి

సంఖ్యలో హాజరయ్యారు. అమరవీరునికి అంతిమ శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలోని ఏడుకోట్లం ముస్లిం మతస్థులలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన మొట్ట మొదటి వాడ్ని నేను. ఆ విషయం తలచుకున్నప్పుడంతా నాకు గర్వం గా ఉందని, ప్రక టించిన అష్పాఖ్‌ను ఆయన పుట్టిపెరిగిన మట్టితనలో కలుపుకుంది. మాతృదేశం కోసం ప్రాణాలర్పించడం ఎంతో అదృష్టమని గర్వపడిన అష్పాఖ్‌ తన ఇరవై ఏడేళ్ళ వయస్సులోనే వందేళ్ళ జీవితాన్నిముగించుకుని వందల ఏళ్ళ కీర్తిని మూటగట్టుకుని అమరలోకాలకు తరలివెళ్ళిపోయారు.

ఈ గ్రంథం నాయకుడు అష్పాఖుల్లా ఖాన్‌ కార్యక్రమాలకు సంబం ధించిన కొనన్నిఊహా చిత్రాలను, భారత భారతి పుస్తకమాల (హైదారాబాదు) వారు ప్రచురించిన అష్పాఖుల్లా ఖాన్‌ గ్రంథంనుండి స్వీకరించాం. ఆ గ్రంథంరచయితకు, ప్రచురణకర్తలకు, మా ప్రత్యేక ధన్యవాదాలు

- రచయిత మరియు ప్రచురణకర్తలు

71