పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

తయారుచేసి ఉంచిన ఓ వినతి పత్రాని చూపారు. ఆ వినతి పత్రంలో పేర్కొన్న అంశాలను చూసి న్యాయవాది కంగారుపడ్డాడు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ, అలా రాసావేంటని అష్పాఖ్‌ను ప్రశ్నించారు. ఈ వినతి పత్రాన్ని పంపితే మీకు శిక్ష తగ్గటం కాదు కదా, ఇతరులకు విధించిన శిక్షలన్నీ కూడా మీకు చుట్టుకుంటాయని న్యాయవాది అష్పాఖ్‌ను కోపగించుకున్నాడు. న్యాయవాది హెచ్చరికలను అష్పాఖ్‌ చిరునవ్వుతో స్వీకరిస్తూ కాసేపు మౌనం వహించారు.

మౌనంగా ఉన్న అష్పాఖుల్లాను ఆభ్యర్థన పత్రం అలా ఎందుకు తయారు చేశారు?, అంటూ ఆ తయారిలో గల ఉద్దేశ్యం ఏంటని గుచ్చి గుచ్చి ప్రశ్నించాక అష్పాఖ్‌ న్యాయవాదికి సమాధానమిస్తూ, నిజం ఏమిటంటే బిస్మిల్‌ కోరిక మేరకు ఇలా రాసాను. బిస్మిల్‌ నాతో కలిసినప్పుడు ఈ విధంగా రాస్తే తనకు ఉరిశిక్ష తప్పి, జీవిత ఖైదు పడగలదని అన్నాడు. ఆయనకు మేలు జరుగుతుంది కనుక ఆయన కోరినట్టు చేస్తానని వాగ్దానం చేసాను. ఆయన క్షేమం కోరుతూ అభ్యర్థన పత్రం అలా తయారు చేశాను, (SHAHEED Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidayardhi, Page.86) అని అష్పాఖ్‌ చెప్పారు.

ఈ వివరణ విన్న తరువాత ఆ అప్పీల్‌ను ఎవ్వరికి పంపవద్దని, ఆలా పంపితే ప్రాణం మీదకు వస్తుందాని కృపాశంకర్‌ అష్పాఖుల్లాను హెచ్చరించాడు. మిత్రుడి కోసం బలికావడానికి సిద్దపడిన అష్పాఖుల్లా ఖాన్‌ తన న్యాయవాది కృపాశంకర్‌ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. ఆయన తయారు చేసిన వినతి పత్రాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా యధావిధిగా ప్రీవీ కౌన్సిల్‌కు పంపివేశారు.

సమర్ధుడైన నేత కోసం నేరం ఒప్పుకోలు

పండిత బిస్మిల్‌ వ్యక్తిగతంగా అష్పాఖుల్లా ఖాన్‌ను తమ్ముడిలా, ప్రధాన అనుచరు డిగా చూసుకున్నారు. కాకోరి కుట్ర కేసును విచారించిన బ్రిటీష్ న్యాయాధికారి కూడా అష్పాఖ్‌ను శ్రీ బిస్మిల్‌ ప్రదాన సహచరుడిగా పేర్కొన్నారు. హిందూస్థాన్‌ రిపబ్లిక్ అపోసియేషన్‌ నిర్వహించిన పలు యాక్షన్స్‌లో శ్రీ బిస్మిల్‌తోపాటుగా బాధ్యతలను నిర్వహించిన అష్పాఖుల్లా, న్యాయస్థానం విధించిన శిక్షలలో కూడా సమానత్వం అనుభవించారు. శ్రీ బిస్మిల్‌ మాటను అష్పాఖుల్లా ఎన్నడూ జవదాటలేదు. చివరకు శ్రీ బిస్మిల్‌ ప్రాణానికి తన ప్రాణం అడ్డువేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. కాకోరి కేసులో శిక్షలు

58