పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

హితవు పలికినందుకు ధన్యవాదాలు. అయితే విప్లవకారులు హిందూ రాజ్యం కోసం ప్రయత్నించినా ఇప్పటి ఆంగ్లేయుల నిరంకుశత్వం కంటే, హిందూ రాజ్యమే ముస్లిం ప్రయోజనాలకు మేలని నేను భావిస్తున్నాను. అయితే యావద్భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాటమే విప్లవకారుల ధ్యేయమని నాకు తెలుసు, (బిస్మిల్‌ ఆత్మకద: పేజి 151) అని ఖరాఖండిగా చెప్పారు. ఆ సమాధానంలో ఇక చేసేది లేక ఆ ఆధికారి తప్పుకున్నాడు.

అంతటి తో ప్రబుత్వం, పోలీసు ఉన్నతాధికారులు మిన్నకుండి పోలేదు. ఆ పోలీసు అధికారి ద్వారా మాత్రమే కాకుండా మేజిస్ట్రేట్ అయినుద్దీన్‌ ద్వారా కూడా అష్పాఖ్‌లో మత తత్వం విషబీజాలను నాటి ఆయనను తమ దారికి తెచ్చుకోవాలని నూతన ప్రయ త్నాలు ఆరంభించారు. ఆ పథకం మేరకు ఓ రోజున మేజిస్ట్రీట్ అయినుద్దీన్‌ నక్క వినయాలతో, అతి నమ్రత ప్రదార్శిస్తూ అష్పాఖ్‌ చెంత చేరాడు. ఆయన, ఆయన కుటుంబం మంచి చెడులను విచారించాడు. కాకోరి రైలు సంఘటన ప్రధాన కేసులో ఆయన సహచరులకు పడిన ఉరిశిక్షలు, యావజ్జీవిత కారాగారవాస శిక్షలు తదితర కఠిన శిక్షలను గుర్తుకు తెచ్చాడు. అష్పాఖ్‌ను బయపెట్టాడు. ఆ పప్పులేమి ఉడకకపోవటంతో, చివరి అస్త్రంగా మతాన్ని రంగంలోకి తెచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన ఎంతో తెలివిగా మ్లాడుతూ, ఇదంతా హిందువుల కుట్ర. రాం ప్రసాద్‌ బిస్మిల్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడు. మీరు ముస్లిం అయిఉండి ఎలా మోసపోయారు? అంటూ అష్పాఖ్‌ మీద ప్రశ్నలను సంధించాడు. ఆ ప్రశ్న, ఆ ప్రశ్నలోని విభజించి-పాలించు కుతంత్రం, ఆ ప్రశ్నలో దాగిఉన్న మర్మాన్ని గ్రహించిన అష్పాఖ్‌ ఆ ఆధికారికి సమాధానమిస్తూ, రాంప్రసాద్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడన్న విషయం అబద్దం. ఒక వేళ అది నిజమైతే, బ్రి ష్‌ రాజ్యం కంటే హిందూరాజ్యం మేలు కదా, అని అన్నారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidhyardhi.52)

అష్పాక్‌ అంతటితో ఆగలేదు. ఈ కేసులో, నేనొక్కడినే ముస్లిం కావటంతో నా బాధ్య త మరింత పెరిగింది. నేను ఏదైనా పొరపాటు చేశానా? ఆది ప్రదానంగా ముస్లింల మీద మా పఠాన్‌ జాతి జనుల మీద మాయని మచ్చగా మిగిలి పోతుంది. కనుక నన్ను గౌరవ ప్రదంగా మరణించనివ్వండి అని కూడా ఆ అధికారితో అన్నారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidhyardh.53) ఆ సమాధానాలతో బిత్తరపోయిన అధికారి మరోమాట లేకుండా తోకముడిచాడు.

55