పుట:శ్రీ సుందరకాండ.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                 56
అచ్చ తెలుపుతాయల విమానములు,
నిగ్గు పసిడివన్నెల తోరణములు
శోభిల్లు దశాస్యుడు పాలింపగ
దనుజులున్న లంకను కనుచుండెను.
                  57
చుక్కలనడుమను సుఖముగమెలగుచు,
వేయిచేతులను వెన్నెలచాందిని
చాచిపట్టి, హరిసాచివ్యమునకు
వచ్చె చంద్రభగవానుడు తూర్పున.
                   58
శంఖమువలె స్వచ్ఛంబయి, క్షీరమృ
ణాలకాంతులను నోలలాడుచున్,
కొలకున మెరసెడి కలహంసవలె
కాంచెను చంద్రుని కపికులచంద్రుడు.

53