పుట:శ్రీ సుందరకాండ.pdf/65

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 2

                50
ఆ ప్రదోషసమయముదాక నిరీ
క్షించి ప్రవేశించెను మారుతి, సువి
శాలములై వరుసలుగానున్న మ
హాపథముల లంకాపట్టణమును.
               51
బంగారపు గుబ్బల కిటికీలును,
పాలవెండిస్తంభములు నొప్పు ప్రా
సాద వీధుల విశాలమగుచు, గం
ధర్వనగరి చందమున వర్ధిలును.
                52
ఏడంతస్తుల మేడలు, నెనిమిది
అంతిపురంబుల హర్మ్యధామములు,
స్ఫటికఫలకములు పఱచిన నడవలు,
అతిశయించు హేమాలంకృతమయి.
                53
వైడూర్యంబులు పచ్చలు ముత్యము
లలికినట్లు భాసిలు అంగణములు,
సుందరంబులై చూడ వేడుకగ
అమరు అసురనాయకుల భవంతులు.
                54
చిత్రచిత్రమగు చెక్కడములతో
తీరుతీరు బంగారు తోరణము
లెల్లెడలను శోభిల్లుచుండె లం
కానగరము శృంగారమయంబయి.
                55
ఎన్నరాని, యూహింపగజాలని,
లంకానగర విలక్షణ విస్మయ
రూపము వానరదీపకు డారసి
మోద ఖేదముల మునిగె పదంపడి.

52