పుట:శ్రీ సుందరకాండ.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                44
బలపటిష్ఠు లీ పాపరాక్షసులు,
లేదు వీరికి తెలియనిదేమియిట,
గాలికూడ లంకావాసుల కే
ర్పడక విసరదని పలుకు లోకములు .
                45
ఇప్పుడిచట నా యెప్పటిరూపున
ఉంటినేని మృత్యువుతప్పదు నా
అర్ధాంతరమున అపహాసంబై
పోవు స్వామి సుగ్రీవుని కోరిక .
               46
ఇది యిట్లగుటను, ఎట్టులేని రఘు
రాముని ప్రియకార్య సుసిద్ధికయి,
నా స్వరూపమును హ్రస్వగించి చొ
చ్చెదను లంకను నిశీధసమయమున.
              47
కావున నే డీ రావణుపురము ని
శీధమున ప్రవేశించి యేమరక
మూలమూలలను గాలింతును దూ
రాంతికములు దర్శింతును సీతను.
               48
అని చింతించుచు హనుమంతుడు వై
దేహిని చూచు కుతూహల లాలస,
నాతురుడై సూర్యాస్తమయము న
పేక్షించుచు గడిపెను పగలంతయు.
                49
ప్రొద్దుగ్రుంకి, యిమ్ముల చీకటిపడ
తోడ్తో హరి తన తోరపు రూపును
సంకుచించి మార్జారమానముగ
మాఱిపోయి విస్మయము జనింపగ.

51