పుట:శ్రీ సుందరకాండ.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 2

                   38
విదితాత్ముడు రఘువిభు, డాతని కా
ర్యము ఫలించు విఘ్నము లేకేగతి
ఎట్లు చూడగల నేకాంతముగా
ఒక్కర్తుకయైయున్న జనకజను.
                  39
దూతలు నీతివిదులు కానప్పుడు
దేశ కాలములు తిరుగు నడ్డముగ
చెడును కార్యము సుసిద్ధంబయ్యును,
ప్రొద్దుపొడుపుల విఱుగు చీకటివలె.
                40
కార్యంబులు విఘ్నములై చెడు దూ
తలు పండితమానులయిన; అర్థా
నర్థముల నిదానముపట్ల ప్రకా
శించక వారి విశేష ప్రజ్ఞలు.
               41
రాముని యిష్టార్థం బెటు చెడకుండును
ఎట్లు పిరికితన మెనయకుండు నను,
దరిలేని సముద్రము దాటిన నా
శ్రమ మెట్టుల వ్యర్థము కాకుండును ?
               42
ఆత్మవిదుడు, ధర్మాత్ముడు, రాముడు
రావణ సంహారమునకు సమకొనె,
ధర్మార్థం, బిది ధ్వంసమగును నే
నిట రాక్షసపతి దృష్టికి చిక్కిన.
               43
రాక్షసవేషపరాయణుండనయి
సంచరించినను సందేహింతురు
శక్యము కా దజ్ఞాతచారమిట;
ఏ రూపున, మఱి యెట్లు మెలగుదును?

50