పుట:శ్రీ సుందరకాండ.pdf/504

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  19
మఱియు దేవి నన్నరసి యిట్టులనె,
వాయుసుతా ! నీ వీయెడ చూచిన
నా దుర్ధ శనంతయు వినిపింపుము
నా మాటలుగా రామున కిట్టుల.
                 20
జ్ఞప్తి యుండు రఘునాథ ! నా నుదుట
చెరిగిన తిలకము నరసి నీ వపుడు
చెంతనున్న మణిశిల చాది స్వయము
బొట్టు పెట్టితివి, పోలు స్మరింపగ.
                21-22
ప్రాణపదముగా పరిరక్షిచిన
ఈ చూడామణి నిమ్ము రామునకు,
సుగ్రీవుడు వినుచున్ కనుచుండగ
తెలుపుము నా పరిదేవన మంతయు.
                23-24
నీటపుట్టిన మణి యిది, పంపితిని,
దీని గని ప్రమోదింతువు నీవని;
ఒక్క నెల బ్రతికియుందును రాక్షసు
చెఱలో, ఆవల జీవింపను ప్రభు !
                   25
అనుచు దేవి చెప్పెను నా కంతయు;
చిక్కి చెన్ను మాసినది మేను, రా
వణుని యింట చెఱబడి అల్లాడును,
కనులు తెఱచుకొని కన్నె లేడివలె.
                26
తేటతెల్లముగ తెలిపితి నఖిలము,
రఘుకులేంద్ర ! వారాశిజలంబులు
దాట తగిన సాధన సన్నాహము
సర్వవిధంబుల సలుపు టవశ్యము.

491