పుట:శ్రీ సుందరకాండ.pdf/502

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                    5
సీత యెచ్చట వసించుచునున్నది ?
దినములు గడుపును దేవి తానెటుల ?
నన్ను తలచి ఏమన్నది ? వైదే
హీ వృత్తాంతము నెల్లను చెప్పుడు.
                  6
రాఘవు డడిగిన ప్రశ్నలకు సమా
ధానము చెప్పగ వానరవరు ల
ర్థించి రపుడు, వైదేహికథాకో
విదుడగు హనుమను వేయినోళ్ళతో.
                   7
తనవా రర్థించిన మంచిదనుచు,
అనిల తనూజుడు హనుమంతుండును
శిరసువంచి దక్షిణముఖుడై సీ
తను స్మరించుచు కథనము మొదలిడెను.
                    8-9
సీతను అన్వేషింపగ దాటితి
నూఱామడల పయోరాశిని, ద
క్షిణ తటమున రావణుని నివాసము
లంకాపురము కలదు దుర్గమముగ.
                  10
అచట రావణుని అంతఃపురమున
తిలకించితి వై దేహిని రాఘవ !
తావక బద్ధ ధ్యానరతిని త
పించు నీ పయి అపేక్షలను నిలిపి.
                    11
రక్కసి మూకలు కక్కసపెట్టగ,
క్షోభిలు దేవిని చూచితి వనమున,
పగలు రేలు కావలియుందురు, వికృ
తాకారిణులగు రాకాసు లచట.

489