పుట:శ్రీ సుందరకాండ.pdf/499

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 64

                   32
కృషియు, ధృతియు, శక్తియుగల హనుమయు,
అంగద జాంబవదాదులు అధినే
తలయి నడిపిన జతనములు, విఘ్నము
లగుటెట్లు? రఘుకులాన్వయ రత్నమ !
                  33-34
చింతింపకు రఘుశేఖర ! వినబడు
హనుమజ్జయ దర్వాతిశయంబున
ఈ తలమ్రోతల నేగుదెంచు కపి
కులవీరుల కిలకిల మన కింతనె.
                   35
కార్యసిద్ధి సంగతులు తెలుప కి
ష్కింధకు వచ్చెడి కింకిర సంకుల
మంతలోన విని, అలరి హరీశుడు,
లోళించెను తన వాలాభరణము.
                  36-37
హర్షముతో హృదయములు తొణక , కపు
లందఱును హనుమ ముందుండగ, అం
గదునితోడ, రాఘవ దర్శన కు
తుక మొరయ, హరీంద్రుని పొంత దిగిరి.
                   38
తోడనె, హనుమంతుడు, మహాభుజుడు,
వినయ వినీతుడు వేడుకతో, తల
వాల్చి మ్రొక్కి, రఘువరుతో ననె, ఉ
న్నది, దేవి నియతి నక్షతయై అట.
                  39
సుగ్రీవుండును సుస్తిమితుండా
యెను, సాధించెను హనుమంతుడె కా
ర్యంబని; లక్ష్మణు డాత్మప్రీతి, క
టాక్షించె బహుమతాక్షుల హనుమను.

486