పుట:శ్రీ సుందరకాండ.pdf/498

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                26
ఊరడిల్లుము రఘూత్తమ ! శుభమగు,
సీత దర్శనము సిద్ధించిన, దటు
కాకున్న, గడువు గడచి నా కడకు,
రాజాలరు వారలు తథ్యం బిది.
                27
బాహు విక్రమ ప్రథితుడు, యువ రా
జంగదుడు కపికులాగ్రణి, కార్యము
విఫలమైనచో విచ్చేయడు సుమి,
నా యెదటికి ఎన్నండును రఘువర !
                 28
చేపట్టిన పని చెడిపోయినచో
వారలిట్లు మధుపానమునకు తల
పడరు; దీనులయి వాడిన ముఖముల,
ముందు వెనకలై మందటిల్లుదురు.
                  29
తరతరముల తాతలు తండ్రులును, ప్ర
తిష్ఠించి, మనసుతీర పెంచి, యి
చ్చిన మా మధువనమును యువరా జిటు
చొచ్చి చూఱగొని శూన్యము చేయడు.
                 30
కాఱియపడకుము కౌసల్యాసుత !
ఊరడిల్లుము, విచారము మానుము,
సీతను దర్శించెను హనుమంతుడు,
సందేహము లేదిందుకు సువ్రత !
                 31
హనుమ యొకడె కార్యము సాధింపగ
లా, డితరులకు అలవికానిది యిది;
దక్షతయును, సాధన సంపత్తులు
కల, వాతని కొక్కనికె సమృద్ధిగ.

485