పుట:శ్రీ సుందరకాండ.pdf/496

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

               13
పని ముగిసిన తరువాత తోటలో
తారాడుట ఉచితంబుకాదు, వా
నర వరులార ! మనకు; శంకింతును
రాఘవుండు మన రాకను వినెనని.
               14
మనసారగ త్రాగిన కపి వీరులు,
సొమ్మలు పాయ సుఖమ్ముగ లేచిరి,
వానర పరమేశ్వరుడగు సుగ్రీ
వుని సన్నిధి కిక పోవలె శీఘ్రమె.
                 15
హరికుల నాయకు లందఱు మీరలు
చెప్పినట్లు నడచెద జవదాటక,
నిర్వాహకులే నిర్ణాయకులని
నమ్ముదు నేను మనః ప్రమాణముగ.
               16
రఘురాముని కార్యము సాధించిన
యోధవరుల నే యువరాజు ననుచు
ఆజ్ఞ లు పెట్టుట అపచార, మయు క్తము
మీ యెడ నట్టుల మెలగ నెన్నడును.
               17
అటు, లంగదు డిష్టార్థము తెలుపగ ,
విని, వానరకుల వీరులందఱును,
మానసములు సమ్మదమున పొంగగ
బాగుబాగనుచు పలికి రొక్కసుతి.
              18
రాజకుమారక ! ప్రభువువయ్యు, ఇటు
వాకొ నె నీవలె పాలకు డెవ్వడు ?
సర్వము నేనని సందడింత్రు నృపు
లైశ్వర్య మదం బావేశింపగ.

483