పుట:శ్రీ సుందరకాండ.pdf/495

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 64

                  6
పాన పిపాసను వచ్చిన వీరుల
నడ్డగించిరని ఆగ్రహింపకుము,
సౌమ్యుడ ! మధురక్షకు లజ్ఞానులు,
తెలియక మిమ్ము అధిక్షేపించిరి.
                7
బలశాలివి, హరివాల్లభ్యమునకు
యువరాజువు, సౌమ్యుడ ! వనపాలకు
లజ్ఞానులు, మౌడ్యమునన్ చేసిన
తప్పు క్షమింపన్ తగు ఉదారముగ.
                 8
వానర చక్రము పాలించెను నీ
తండ్రి వాలి మును, దానికి తగుదురు
నీ పినతండ్రియు నీవును, రాజకు
మార ! సమర్థులు లేరిపు డితరులు.
               9
పోయి నీ పితృవ్యునకు చెప్పితిని
ఇచ్చట మీరలు వచ్చి విడిసిరని,
విని, సంతోషించెను కినియక, ర
మ్మని పిలిచెను మిమ్మందఱి నచటికి.
                10-11
మీ రాకకు సంప్రీతి చెంది, తన
కధిక ప్రియమగు మధువనంబులో
విచ్చల విడిగా చొచ్చి, త్రాగి, మ
ల్లాడి రన్న విని ఆనందించెను.
                12
దధిముఖు డటు సాంత్వనముగ తెలిపిన
ప్రభువు ప్రియామంత్రణమును విని, అం
గదు డుల్లాసము పొదల, వానరుల
యందఱితో ఇట్లనె వినీతముగ,

482