పుట:శ్రీ సుందరకాండ.pdf/475

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సుందరకాండ

సర్గ 60

                 1
హనుమ కథనమును విని వాలిసుతుడు
అంగదు డిట్లనె, ఆర్యను లక్షిం
చియు తోడ్కొనిరాక , యిపుడూరకిటు
లిక్ష్వాకుల కడకేగుట యుక్తమె.
               2
సీతనుకని భాషించితి, మామెను
కొని తేలేదనుచు నివేదించుట,
మీక యుక్తమని నాకుతోచెడిని,
ఆలోచింపుడు ఖ్యాతవిక్రములు.
                3
సోదర వానరశూరులార! మన
కీడు కానరా రెవ్వ రెందును, ప్ర
తాప పరాక్రమ దర్పధైర్యముల
దైత్య దేవకుల ధామములందును.
                  4
అదిగా కట, హతమార్చి వచ్చె మన
హనుమ దైత్యనాయకుల నెందఱినొ,
ఇక నేమున్నది యేగి జానకిని
కొనివత్తము సంకోచము లెందుకు?

462