పుట:శ్రీ సుందరకాండ.pdf/442

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


                    44

సీతను దర్శించితినని మారుతి
విశదముగా చెప్పినపిమ్మట, అం
గదుడు పలికెను సగౌరవముగ హరి
వీరులందఱును వినగా ఇట్టుల.
                   45
అతి విస్తారంబయిన సముద్రము
దాటి, క్రమ్మఱి యథా విధి వచ్చిన
నీకు సాటి కన్పించరు సాహస
బల కౌశలముల వానరాగ్రణీ !
                  46
జీవిత దాతవు నీవు మాకు, సి
ద్ధార్థుల మైతిమి హరికుల నాయక !
నీ ప్రసాదమున నేడిక రాముని
చూడ గల్గుదుము సుమి ! మో మోడక .
                  47-48
ఏ మందుము నీ స్వామి భక్తి, నీ
ధృతి వీర్యంబు; లదృష్టము పండగ
రామ పత్ని నారసితివి, ఇక ఇ
క్ష్వాకుని శోకము చల్లారును హరి !
                  49
అంతట వానరు, లంగద జాంబవ
దాదు లందఱును, హనుమ సముద్రము
దాటిన కథనంతయు విను వేడ్కను,
కూర్చుండిరి గిరకూట శిలలపయి.
                   50
లంకను చొచ్చుట, లంకలోన రా
వణు నీక్షించుట, వైదేహిని ద
ర్శించుట వినవలచిన కపులును, దో
సిళ్ళుపట్టి నిలిచిరి హనుమ యెదుట.

429