పుట:శ్రీ సుందరకాండ.pdf/430

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  5
ఆహవ శూరుం డయిన మహాత్ముని
రఘురాముని విక్రమ విఖ్యాతికి
తగిన కార్యసాధక విధానమును
ఉపదేశింపుము కపి కంఠీరవ !
                   6
సీత యట్టుల సహేతుకంబుగా
పలికిన సార్థక వచనము లన్నియు,
అవధానముతో ఆకళించి బదు
లాడెను వానరచూడామణి యిటు.
                   7
దేవి ! యేమిటికి దిగులున పొగిలెదు,
వానర భల్లుక సేనలతో శీ
ఘ్రమె వచ్చును రాఘవుడు, రాక్షసుల
చెండాడును నీ చెఱలను తీర్చును.
                   8
ఇట్టుల వైదేహి మనో వేదన
లుపశమింపగా ఊరటలాడి, మ
హా కపి తిరుగు ప్రయాణ బుద్ధితో,
ప్రణతుడై ప్రదక్షిణ మొనరించెను.
                   9
స్వామి దర్సనోత్సాహదోహదము
వేగిరింప కపివీరాగ్రేసరి,
ఒక్క ఊపున మహోన్నతమైన అ
రిష్ట పర్వతము శృంగము నెక్కెను.
                   10
తుంగ పద్మక ద్రుమ వనరాజీ
రంజితమై పర్వతము కనంబడె,
శిఖరంబుల అంచెల మేఘంబులు
వల్లె వాటువలె వాలుచునుండగ.

417

27