పుట:శ్రీ సుందరకాండ.pdf/429

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 56

శ్రీ

సుందరకాండ

సర్గ 56


                    1
జొంపమయిన శింశుప క్రిందనె కూ
ర్చున్న మైథిలికి చుట్టును తిరిగి, న
మస్కరించి కపి 'మాతరొ ! కసుకం
దక నిలిచితి విది నాసుకృతంబగు.'
                   2
తిరుగు ప్రయాణపు త్వరలోనున్న, హ
రీంద్రుని పొరిపొరి వీక్షింపుచు వై
దేహిపలికె భర్తృస్నేహము తొల
కాడుచున్న హృదయముతో తిన్నగ.
                   3
పరవీరాంతక ! ప్రారంభించిన
కార్య, మవిఘ్నముగా తీర్చిన శూ
రుండవు నీవొక్కండవె, మారుతి!
నీ బలము పురాణించు యశముతో,
                   4
శరఘాతలతో సంకులముగ రిపు
రాక్షస బలమర్దనము సలిపి, నను
కొనిపోవుట కాకుత్థ్సున కొప్పును,
అది రాముని శౌర్యమునకున్ తగును.

416