పుట:శ్రీ సుందరకాండ.pdf/406

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ



                   23
కావున నీవీ కపివధ కార్యము
కట్టిపెట్టు; మీ ఘన సన్నాహము
దేవేంద్రునితో దేవతలను
అరిగొను తఱిచేయగ దగును ప్రభూ !
                  24
అదిగా, కితడిట అంతమై న దూ
రముననున్న ఆ రాజపుత్రులను
యుద్ధప్రియ దుర్బుద్దుల నిచటికి
దో తెచ్చు సమర్థుడు కానబడడు.
                 25
శౌర్యవిక్రమోత్సాహ ధుర్యులగు
దేవాసురులకు నీ వజేయుడవు,
ఆపనేల యోధానందన రణ
దీక్షారంభము రాక్షసరంజక !
                26
వీరకులీనులు శూరాగ్రేసరు
లస్త్రశస్త్రధరు లయిన యోధు లు
న్నారు నీకు ముందఱనె యెందఱో !
పోరాటమునకు ఆరాటించుచు.
                27
కావున భవదగ్రచమూ నాయకు
లందు కొందఱు ప్రయాణమై విడిసి,
మూఢులయిన నృపపుత్రకులకు చూ
పింత్రుగాక నీ వీరవిక్రమము.
                28
అమరద్వేషి, మహాబలవంతుడు,
రాత్రించరకుల రాజరాజు, గ్రహి
యించె విభీషణు మంచిమాటలను,
తమ్మునిపై గల నెమ్మి నమ్మికల.

393