పుట:శ్రీ సుందరకాండ.pdf/404

ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                11
శాత్రవ భీషణ ! శాస్త్రవిభూషణ!
పాపకర్ములను వధియించుట పా
పముకా, దీతడు పాపియె కావున
వధియించెద నీ వానరు నిప్పుడు.
                    12
అన్నమాట, లన్యాయపక్షము, ల
నార్యజుష్టములు నయి వినిపింపగ,
పరమార్థంబుల నెఱగిన బుద్ధి మ
దగ్రణి యిట్టుల ననె విభీషణుడు.
                   13
శాంతింపుము రాక్షసరాజేశ్వర !
చంపరాదు రాజన్యులు దూతల
ననుచు పలుకుదురు ప్రాజ్ఞులు, కావున
న్యాయమైన వాక్యము నాలింపుము.
                   14
లేదు సందియం బీ దుష్టుడు శా
త్రవుడు, చేసె నపరాధము లయినను,
చంపరాదు రాజన్యులు దూతల;
పలుదండనములు కలవు దూతలకు.
                   15
వికలాంగుని కావించుట, కొరడా
చేఱులతో మెయిచిట్లగ కొట్టుట,
శిరసు ముండనముచేయుట, శిక్షలు;
దూతవధం బెందును వినబడ దిల.
                  16
వెనుకముందుల వివేచనగల ధ
ర్మార్థ వినీతుడ వయిన నీవె కో
పావిష్టుడవయి తకట ! సత్వవం
తులు ప్రతిరోధింతురు కోపంబును.

391