పుట:శ్రీ సుందరకాండ.pdf/403

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 52

                5
క్షమియింపుము రాక్షస రా జేంద్ర! ప్ర
సన్నుడవై రోషము నడచి వినుము,
మన్నింపుము నా మాటను, దూతను
చంపరాదు రాజన్యసత్తములు.
              6
రాజధర్మశాస్త్ర విరుద్ధము, లో
కము గర్హించును; కపివధ వీరుడ
వగు నీ పేరుకు తగినది కాదు, ప
రావరజ్ఞుడవు భావింపుము మది.
                 7
ధర్మజ్ఞుడవు కృతజ్ఞుడవు, సకల
రాజనీతిపారగుడ, వఖిల భూ
తప్రపంచ తత్వజ్ఞుండవు, పర
మార్థవిదుడ వీ వసదృశుండ విల.
               8
నీవంటి నిఖిల నీతివేత్తలును,
సులభరోష వివశులయి తొడిబడిన,
శాస్త్రాభ్యాసశ్రమము కేవలము
బండమోత కావలె నసు రేశ్వర !
                9
కావున, శత్రుఘ్న ! దురాసదుడవు,
నీవు సుంత శాంతించి, విచారిం
పుము యుక్తాయుక్తములు, విధింపుము
దూతదండన యధోచిత విధమున .
              10
రాక్షసేశ్వరుడు రావణుండును వి
భీషణు పలుకులు విని, దుర్భరమగు
రోషవేగమున రుధిరాక్షుండయి
ప్రత్యుత్తరమును పలికె నీ పగిది.

390