పుట:శ్రీ సుందరకాండ.pdf/377

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

సుందరకాండ

సర్గ 48


             1
మారుతి అక్ష కుమారు వధింపగ
దానవేంద్రుడు యథా మనస్సమా
ధాన పరుండయి, తనయు నింద్రజితు
ఇంద్రసముని పిలిపించి యిట్లనెను.
              2
అస్త్ర విదుండవు శస్త్ర కుశలుడవు;
సురుల కసురులకు శోకదాతవై
నీ పౌరుషమును చూపి తింద్రునకు,
అజుని కొలిచి బ్రహ్మాస్త్ర మందితివి.
             3
నీవు చాపమందిన మాత్ర సురా
సురులు విఱిగిపోయిరి దిక్కుల బడి,
కదనంబున నిన్నెదిరించి ప్రయా
సల గాసిల్లని శత్రువు లెవ్వరు ?
            4
భుజబల మహిమయె నిజ రక్షకముగ,
చేసిన తపములె క్షేమ కవచముగ,
కాపాడును నిను, గమనింపగలవు
దేశ కాలముల తీరుతెన్నులను.

364