పుట:శ్రీ సుందరకాండ.pdf/369

ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 46

                   35
అంతట, వీరుడు హనుమంతు డలిగి
పాముల మృగముల పాదపములతో
కొండ శిఖరమును కుదిపి, పెరికి, వడి
రాక్షస యుగ మర్దనకు కడంగెను.
                   36
ఆ దెబ్బలు తిని హతమై నీల్గిరి
ఏవురు సేనాధీశులు; పిమ్మట
బ్రతికియున్న రావణు సైన్యములను
నాశము చేసె ననాయాసంబుగ.
                   37
సేనాపతులు నశింపగ, వారి గు
ఱాల మీదను గుఱాలనూకి, ఏ
నుగుల మీద ఏనుగుల నెట్టి, ర
థాల మీదను రథాలను త్రోసెను.
                   38
అమరేంద్రుడు మున్నసురులబోలె, మ
హా కపి రక్కసి మూకల గెడపగ,
కూలిన తేరులు, గుఱ్ఱము, లేన్గులు,
రాసులు పడె మార్గముల కడ్డముగ.
                   39
ఆయుధ బలవాహనములతో నా
యక సేనల తెగటార్చి మహాకపి,
తోరణంబుపయి కూరుచుండె; క
ల్పాంత వాసరకృతాంతుని వంతున.

356